కొవ్వూరు : ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచనలు చేయని విధంగా పేదల కోసం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చేశారని చెప్పడానికి రాష్ట్రంలో
అమలవుతున్న పథకాలే నిదర్శనమని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి
డాక్టర్ తానేటి వనిత అన్నారు. గడప గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ఒక్క
జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
భాగంగా 128వ రోజు చాగల్లు మండలం చాగల్లులో ఆమె సోమవారం పర్యటించారు.
ఇంటింటికీ వెళ్లి నాలుగేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు
చేస్తున్న పథకాలను ఆమె వివరించారు. ఏవైనా సమస్యలున్నా, అర్హులై ఉండి ఎవరికైనా
పథకాలు అందకపోయినా వెంటనే తెలియజేయాలన్నారు. ఈ క్రమంలో పలువురు ఆమె దృష్టికి
తీసుకువచ్చిన చిన్నచిన్న సమస్య లను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ
సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకొని
వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం
రూపొందించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ప్రభుత్వం కృషి
చేస్తోందని ఆమె తెలిపారు. అర్హత ప్రామాణికంగా ప్రతి కుటుంబానికి సంక్షేమం
అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి ఏ ఇంటికి
వెళ్లినా ప్రజల్లో సంతోషమే కనపడుతోందని తానేటి వనిత ఆనందం వ్యక్తం చేశారు. ఈ
కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,
కార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు
పాల్గొన్నారు.