30 వ డివిజన్ 242 వ సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ సెంట్రల్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలన
ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలలో అపార విశ్వాసాన్ని కలిగించిందని ప్లానింగ్ బోర్డు
వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30 వ డివిజన్ 242 వ
వార్డు సచివాలయ పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో
కలిసి ఆయన పాల్గొన్నారు. రామకృష్ణాపురంలో విస్తృతంగా పర్యటించి 280 గడపలను
సందర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలనలో
కొత్త శకానికి నాంది పలికారని మల్లాది విష్ణు అన్నారు. గత ప్రభుత్వంలో ఏ పని
కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి
వచ్చేదని గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ప్రభుత్వ
సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అర్హత ఉండి పొరపాటున ఎక్కడైనా
మిగిలిపోయిన అర్హులను కూడా తలుపుతట్టి మరీ ఈ ప్రభుత్వం మంచి చేస్తున్నట్లు
వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు ఒక పెద్ద కాపీ క్యాట్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కాపీ చేయడమే
చంద్రబాబు పని అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. తెలుగుదేశం
చెబుతున్న కుటుంబ సాధికార సారథులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గృహ సారథులకు
పూర్తిగా కాపీ వెర్షన్ కాదా..? సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటివరకు సీఎం జగన్
ప్రభుత్వ పథకాలనే కాపీ కొట్టిన ప్రతిపక్ష నేత చివరకు పార్టీ కార్యక్రమాలనూ
కాపీ కొట్టే స్థాయికి దిగజారడం సిగ్గుచేటన్నారు. పైగా సీఎం జగన్ పాలనపై ప్రజలు
విసిగిపోయారని బాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా విసిగిపోవడమంటే
అధికారంలో ఉన్న పార్టీని, 23 సీట్లకు పరిమితం చేయడమని మల్లాది విష్ణు ఎద్దేవా
చేశారు. అంతేగానీ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ
బ్రహ్మరథం పట్టడం కాదని తెలిపారు. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు
గుర్తుకు వస్తారని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్
రెడ్డి ఎప్పటికప్పుడు ప్రజా మద్ధతును కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నారని,
2019 ఎన్నికల్లో 49.8 ఉన్న ఓట్ల శాతాన్ని, 51.3 శాతానికి పెంచుకోవడమే ఇందుకు
నిదర్శనమన్నారు.
విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా..?
చంద్రబాబు పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా కుదేలైందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విమర్శించారు. టీడీపీ హయాంలో దాదాపు రూ. 25 వేల కోట్ల బకాయిలు పెట్టి
వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ధైర్యముంటే నారా లోకేష్,
పచ్చ నేతలు విద్యుత్ రంగంపై బహిరంగం చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు
చేసిన తప్పులకు రాష్ట్రం అంధకార ప్రదేశ్ గా మారకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం
పనిచేస్తోందని, గత ప్రభుత్వంలో ఉన్న విద్యుత్ బకాయిలు కూడా తమ ప్రభుత్వమే
చెల్లిస్తోందని మల్లాది విష్ణు చెప్పారు. చంద్రబాబు పాలనలో మూడు సార్లు
విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కానీ ఈ ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు,
నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు
ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 12,653 మెగావాట్ల
గరిష్ట డిమాండ్‌తో 251 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతున్నా
ఎక్కడా విద్యుత్ కోతలు విధించడం లేదని తెలిపారు. వినియోగదారులకు ఏవిధమైన
అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్
కొనుగోలు చేయవలసి వచ్చిందన్నారు. దానివల్ల విద్యుత్ కొనుగోలు వ్యయం ప్రతీ
యూనిట్ కు దాదాపు రూ. 1.20 పెరిగినా.. నిబంధనలకు లోబడి యూనిట్ కి 40 పైసలు
మాత్రమే సర్దుబాటు ధర వసూలు చేయడం జరుగుతోందన్నారు. వ్యవసాయ వినియోగదారులకు
ఉచిత విద్యుత్ సరఫరా నిమిత్తం మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో
భరిస్తుందని చెప్పుకొచ్చారు. విద్యుత్ సమర్ధ వినియోగంలో జాతీయ స్ధాయిలో
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు ఇటీవల మూడు అవార్డులు కైవసం చేసుకున్నట్లు
మల్లాది విష్ణు గుర్తుచేశారు. కార్యక్రమంలో డీఈ రామకృష్ణ, ఏఎంఓహెచ్
రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు మార్తి చంద్రమౌళి, పవన్ కుమార్
రెడ్డి, వి.రమేష్, డి.కృష్ణ, భోగాది మురళి, డి. దుర్గారావు, రఫీ, వర్మ, రాజు,
ముత్యాలు, గోపిశెట్టి శ్రీను, బెజ్జం రవి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ
సిబ్బంది పాల్గొన్నారు.