విజయవాడ : విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా తమ ఆందోళన వ్యక్తం చేస్తూ, రెండు
దశాబ్ధాల క్రితం పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బషీర్ బాగ్ మృతులకు
పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో
సోమవారం నివాళులు అర్పించారు. 2000 సంవత్సరం ఆగస్ట్ 28వ తేది ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, హైదరాబాద్ బషీర్ బాగ్ లో
నిరసనకారులపై పోలీసుల చేత కాల్పులు చేయించిన ఘటన చాలా బాధాకరమని పీసీసీ
అధ్యక్షులు స్పష్టం చేశారు. వారి ప్రాణ త్యాగాలు వ్రుధా పోలేదని
పేర్కొన్నారు. అప్పటి దుర్ఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు
బాలస్వామితో పాటు వామ పక్షాలకు చెందిన విష్ణువర్థన్ రెడ్డి, రామక్రిష్ణలు
దుర్మరణం పాలయ్యారని చెప్పారు. వారి మ్రుతికి సంతాపంగా కాంగ్రెస్ పార్టీ
ప్రధాన కార్యాలయంలో నేతలు అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో
రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, విజయవాడ
నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ సభ్యులు కొలనుకొండ
శివాజి, మేడా సురేష్, మీసాల రాజేశ్వరరావు, షేక్ ఖాజామెహిద్దీన్, రాష్ట్ర లీగల్
సెల్ ఛైర్మన్ వి.గుర్నాధంతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.