నటి ఆలియాభట్ ప్రెగ్నెన్సీ టాక్ ఆఫ్ ద సినిమా వుడ్స్ అయింది. ఆలియా కూడా తన ప్రెగ్నెన్సీ పై పలు విషయాలను వెల్లడించింది. ఆమె ప్రసవ గడువు తేదీ నవంబర్ 2022 అని తెలిసినప్పటికీ, ఖచ్చితమైన తేదీ ఇంకా తెలియదు. నవంబర్ 20 నుంచి 30 మధ్య జరిగే అవకాశం ఉందని ఆమె తెలిపింది. డెలివరీ తేదీ నవంబర్ 28న వచ్చే ఆలియా సోదరి షాహీన్ పుట్టినరోజుకు చాలా దగ్గరగా ఉండవచ్చని కూడా తెలిసింది. నవంబర్ 28 న కుటుంబం వారు ఇకపై రెండు పుట్టినరోజులను జరుపుకోవచ్చని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు.