నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను విడుదల చేసిన సీఎం జగన్
రూ.680.44 కోట్లు 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ
ప్రతి పేద కుటుంబానికి నేటి కంటే రేపు మరింత బాగుండాలి
నగరి పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి
నగిరి : విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100
శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నగరిలో
బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. విద్యాదీవెన
పథకంలో భాగంగా ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది
విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చదువు
కోసం తల్లిదండ్రులు అప్పులపాలవకూడదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం
పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. 8, 44,336 తల్లుల
ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేశామని చెప్పారు. విద్యాదీవెన కింద రూ. 11, 317
కోట్లు అందించామని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి నేటి కంటే రేపు మరింత
బాగుండాలి. తల్లిదండ్రుల పేదరికం పిల్లల భవిష్యత్తుకు అడ్డురాకూడదు.
విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పేద పిల్లలు
ఇబ్బంది పడకూడదనే విద్యాదీవెన తీసుకొచ్చాం. ఇది వాళ్ల భవిష్యత్తు మార్చబోయే
పథకం. నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11 వేల మూడు వందల కోట్లు జమ చేశాం.
8 లక్షల 44 వేల 336 మంది మంది తల్లుల ఖాతాలో రూ.680 కోట్లు జమ చేస్తున్నాం.
జగనన్న వసతి దీవెన కూడా పేద విద్యార్థలు కోసం అమలు చేస్తున్నామన్నారు.
జగన్ అంటే జనం..జనం అంటే జగన్ : మంత్రి రోజా
మంత్రి రోజా మాట్లాడుతూ పేద విద్యార్థులకు సీఎం జగన్ ఉన్నత విద్య
అందిస్తున్నారు. విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు దేశంలో ఎక్కడా లేవు.
విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ఏపీలో విద్యారంగాన్ని
సాక్ష్యాత్తూ ప్రధానే ప్రశంసించారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్.
కాంపౌండర్ కూతురు వైద్య విద్య అభ్యసిస్తుందంటే ఆ ఘనత సీఎం జగన్‌కే
దక్కుతుంది. గతంలో చంద్రబాబు పేదింటి పిల్లలను విద్యకు దూరం చేశారని
విమర్శించారు. ఇంటర్లో తాను ఏ గ్రూప్ చదివాడో కూడా పవన్ కల్యాణ్‌కు
తెలియదని మంత్రి రోజా విమర్శించారు. బైపీసీ చదివితే ఇంజనీర్ అవ్వొచ్చని
చంద్రబాబు అంటారని పవన్, చంద్రబాబులకు కూడా విద్యాకానుక ఇవ్వాలని
చురకలంటించారు. విద్యాదీవెనతో బాబు, పవన్‌కు మంచి చదువు చెప్పించాలని సెటైర్లు
వేశారు. టీడీపీని నమ్ముకుంటే యువత జైలుకు వెళ్తారు. పవన్‌ను నమ్ముకుంటే యువత
రిలీజ్ సినిమాలకు వెళ్తారన్న ఆమె అదే సీఎం జగన్‌ను నమ్ముకుంటే మంచి కాలేజీలు,
వర్సిటీలకు వెళ్తారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా వేదికపై మంత్రి, నగరి
ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిలో తొలిసారి నగరికి
వచ్చేసిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. నగరి నియోజకవర్గానికి సీఎం జగన్
రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాణ్యమైన విద్యను పేదవాడి ఆస్తిగా మార్చిన ఘనత
సీఎం జగన్‌దేనని కొనియాడారు. చదువుకు కుల, మత, ప్రాంత బేధాలు చూడకుండా పేద
విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నారని ప్రశంసించారు.
సాక్ష్యాత్తు ప్రధానే ప్రశంసించారు : విద్యారంగంలో దేశానికే ఏపీ అదర్శంగా
నిలుస్తోందని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్ వల్లే అన్ని వర్గాలకు విద్య
చేరువైందని, కొర్పోరేట్ స్కూళ్లకు ప్రభుత్వ స్కూళ్లు పోటీనిస్తున్నాయని
తెలిపారు. విద్యా దీవెన, వసతి పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకు
రాలేదని తెలిపారు. ఇంత గొప్ప ఆలోచన ఎవరికీ కూడా రాలేదన్నారు. విప్లవాత్మక
మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని, ఏపీలో విద్యారంగాన్ని సాక్ష్యాత్తు
ప్రధానే ప్రశంసించారని ప్రస్తావించారు.
2024 వైఎస్ జగన్ వన్స్‌మోర్ : వైఎస్ జగన్‌ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదని
రోజా అన్నారు. జగన్‌ను ఓడించాలంటే అవతలి వైపు జగనే ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా
గెలవలేని వాడు వైఎస్ జగన్‌ను ఎలా ఓడిస్తాడని ప్రశ్నించారు. ప్రజలంతా 2024
జగనన్న వన్స్‌మోర్ అంటున్నారని, రాష్ట్రంలోని 175 సీట్లు ఇచ్చి దీవించడానికి
ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కుప్పంలో ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చిన ఘనత జగన్‌ది.
వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని పేర్కొన్నారు
చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ : కుప్పంలో సంక్షేమ పథకాలు ఎవరి హయాంలో
అందాయని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కుప్పం నియోజగకవర్గానికి ఏం చేశారని
నిలదీశారు. కుప్పంలోప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్‌దేనని
పేర్కొన్నారు. కుప్పంలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ చతికిలబడిందన్న రోజా
వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి తప్పదని తెలిపారు. వారంటీ లేని
చంద్రబాబు షూరిటీ ఇస్తే గ్యారెంటీ ఉంటుందా? అని మండిపడ్డారు.. మనకు రియల్
హీరో కావాలా? రీల్ హీరో కావాలా అని ప్రశ్నించారు ప్రతిపక్షాలకు మళ్లీ ప్రజలే
తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఆటో డ్రైవర్ కూతురు ఆటో మొబైల్ ఇంజనీరింగ్
చేస్తోంది. రైతు బిడ్డ వ్యవసాయ శాస్త్రవేత్త చదువుతున్నాడు.ఒక మెకానిక్
కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. కంపౌండర్ కూతురు డాక్టర్
చదువుతున్నాడంటే అది ముమ్మాటికీ సీఎం జగన్ వల్లే. అన్న పార్టీలో ఒక
సైనికురాలిగా ఉన్న గర్వపడుతున్నాం. అన్నదానం ఆకలి తీర్చితే అక్షర దానం
అజ్ఞానాన్ని తొలగిస్తుందంటారు. ఆకలి తీర్చాలన్నా, అజ్ఞానాన్ని తొలగించాలన్నా
పేదరిక నిర్మూలన జరగాలన్న అది విద్యతోనే సాధ్యమని మనస్పూర్తిగా నమ్మారు
కాబట్టే ప్రతి పేద వాడి బిడ్డను గొప్ప చదువులు చదివేందుకు సీఎం జగన్ అండగా
నిలిచారని రోజా పేర్కొన్నారు.