బెంగళూరు : చంద్రుడికి సంబంధించి ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశమూ తీయని
అద్భుతమైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)
ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. అవి తమ కంప్యూటర్ కేంద్రానికి
వెళుతున్నాయని చెప్పారు. అక్కడ శాస్త్రవేత్తలు వాటిని ప్రాసెస్
చేస్తున్నారని, త్వరలోనే ఆ ఫొటోలను విడుదల చేస్తామన్నారు. జాబిల్లిపై
ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ సమర్థంగా పనిచేస్తున్నాయని
పేర్కొన్నారు. కొన్ని పరిశోధనల్లో భాగంగా రోవర్ కచ్చితంగా వేర్వేరు
ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. రాబోయే 10 రోజుల్లో ల్యాండర్,
రోవర్లు అన్ని పరిశోధనలను పూర్తిచేస్తాయని తెలిపారు. విక్రమ్ ల్యాండర్
దిగిన చోటుకు ‘శివ్‌శక్తి’ అనే పేరును ప్రధాని మోదీ పెట్టడాన్ని సోమనాథ్
సమర్థించారు. శివ్‌శక్తి, తిరంగా (చంద్రయాన్-2 కూలిన ప్రదేశానికి పెట్టిన
పేరు) రెండు పేర్లూ భారతీయతకు చిహ్నమన్నారు. చంద్రుడితోపాటు అంగారక, శుక్ర
గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపే సత్తా భారత్‌కు ఉందని సోమనాథ్ స్పష్టం
చేశారు. ఈ పరిశోధనల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమని తెలిపారు.
తిరువనంతపురంలో ఉన్న భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన సోమనాథ్ సైన్స్,
ఆధ్యాత్మికం పట్ల తనకు ఆసక్తి ఉందని తెలిపారు.