సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన గంగూబాయి కారియావాడి చిత్రంలో ప్రధాన
పాత్రను పోషించిన అలియాభట్, “మిమి’ చిత్రంలో నటించిన కృతిసనన్ ఈ ఏడాది జాతీయ
ఉత్తమ నటి అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు. వేశ్యగా జీవితాన్ని
ప్రారంభించిన గంగుబాయి కామాటిపురకు నాయకురాలిగా ఎలా ఎదిగింది? ఈ క్రమంలో ఆమెకు
ఎదురైన సవాళ్లు ఏమిటి? దాదాపు నాలుగువేల మంది మహిళల హక్కుల కోసం ఆమె చేసిన
పోరాటం ఏమిటి? అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు. ‘మాపియా క్వీన్స్ ఆఫ్ ముంబై’
అనే నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అలియాభట్ నటన అందరి
ప్రశంసలందుకుంది. ఈ పాత్రలో ఆమె హావ భావాలు, గాంభీర్యత, సంభాషణలు శభాష్
అనిపించాయి. ఇక ‘మిమి’ చిత్రంలో కృతిసనన్ తనదైన నటనతో మెప్పించింది. అద్దె
గర్భం నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మిమి పాత్రలో కృతిసనన్
చక్కగా ఒదిగిపోయింది. సరోగసీ నేపధ్యంలో చాలా చిత్రాలొచ్చినా వాటిలో “మిమి’
ప్రత్యేకంగా నిలిచిపోయింది. ముఖ్యంగా కృతిసనన్ కెరీర్ లోనే బెస్ట్
పర్ఫార్మెన్స్ కనబరచింది.