రాజేంద్రప్రసాద్ నాయకత్వంలో సర్పంచుల సంఘం నాయకులు గవర్నర్ ని కలిశారు.
విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్
ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ , రాష్ట్ర సర్పంచ్ల సంఘం
అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు ఆధ్వర్యంలో సర్పంచుల సంఘం
నాయకులు రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీల నిధులు దొంగలించడం గూర్చి గవర్నర్ కి
రాష్ట్ర ప్రభుత్వం పై ఫిర్యాదు చేశారు.
కేంద్ర ప్రభుత్వం 14,15 వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామపంచాయతీలకు పంపించిన రూ.
8629 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దొంగలించడం గూర్చి, గ్రామ వాలంటీర్లను,
సచివాలయాలను రాజ్యాంగం ప్రకారం సర్పంచుల ఆధీనంలోనే పని చేయించాలని, ఉపాధి హామీ
నిధులను చట్ట ప్రకారం గ్రామపంచాయతీలకే ఇవ్వాలని, గతంలో మాదిరే
గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ఇలా సర్పంచ్ ల
16 డిమాండ్ల గురించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి రాష్ట్ర
ప్రభుత్వం పైన ఫిర్యాదు చేస్తూ, గవర్నర్ జోక్యం చేసుకొని సర్పంచుల , గ్రామీణ
ప్రజల, పంచాయతీల సమస్యలను పరిష్కరించమని ముఖ్యమంత్రి ని ఆదేశించాలని కోరుతూ
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు వినతి పత్రం
అందించారు.
వినతి పత్రం సమర్పించిన వారిలో వై .వి .బి రాజేంద్రప్రసాద్ అధ్యక్షులు ,ఆంధ్ర
ప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ , వానపల్లి లక్ష్మి ముత్యాలరావు (టిడిపి పార్టీ,
విశాఖ జిల్లా) రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచుల సంఘం, బిర్రు ప్రతాప్ రెడ్డి
(కాంగ్రెస్ పార్టీ, కర్నుల్ జిల్లా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , ఆంధ్రప్రదేశ్
పంచాయతీరాజ్ చాంబర్. పగడాల రమేష్ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రకాశం జిల్లా)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , సర్పంచుల సంఘం సీజే కొండయ్య (బిజెపి పార్టీ, కడప
జిల్లా) రాష్ట్ర ఉపాధ్యక్షులు , సర్పంచుల సంఘం గల్లా తిమ్మోతి (జనసేన పార్టీ,
కృష్ణా జిల్లా) రాష్ట్ర అధికార ప్రతినిధి, తదితరులు పాల్గొన్నారు.