అమరావతి : ఎన్టీఆర్ పేరు మీద రూ.100 నాణేం విడుదల కార్యక్రమం ఆహ్వానంపై ఏపీ
తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి రాష్ట్రపతికి
ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ భార్యనైన తనను ఆవిష్కరణ కార్యక్రమానికి
ఆహ్వానించలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణం జోక్యం చేసుకోవాలని
రాష్ట్రపతిని లక్ష్మీపార్వతి కోరారు. భార్యగా తానే అసలైన వారసురాలినని
పేర్కొన్న లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ పేరుపై రూ.100 నాణెం విడుదల
చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు, ఇతర కుటుంబసభ్యుల వల్లే
ఎన్టీఆర్ చనిపోయారని, ఎన్టీఆర్ మరణానికి కారణమైన వారిని కార్యక్రమానికి
పిలవడంపై లేఖలో లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.