గుంటూరు : తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావటంపై ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్
టీమ్‌కు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర
పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయని పేర్కొన్నారు. ఉత్తమ సాహిత్యానికి చంద్రబోస్
(కొండ పొలం) అవార్డు గెలుచుకోవటం సంతోషమని సీఎం అన్నారు. భారతీయ చలనచిత్ర
రంగంలో ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం
ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. 2021
సంవత్సరానికి గానూ ‘పుష్ప: ది రైజ్’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి
అవార్డును అల్లు అర్జున్ సాధించారు.