పల్నాడు జిల్లా : క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం దిశగా సమావేశాలు
జరుగుతున్నాయని, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తాం. పార్టీలో
భిన్నాభిప్రాయాలు సహజం. వాటిల్లో ఏకాభిప్రాయం సాధించాలని ఎంపీ విజయసాయిరెడ్డి
అన్నారు. నరసరావుపేటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అర్థరహితమైన
విమర్శలు చేస్తోందని, చంద్రయాన్ స్పీడ్‌తో చంద్రబాబు వెళ్తున్నారని పచ్చ
బ్యాచ్ ప్రచారం చేస్తోందన్నారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా
చంద్రయాన్ విజయంపై టీడీపీ ఆర్భాటం చేస్తుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
2024లో 24, 25 లోక్‌సభ స్థానాలు వైఎస్సార్సీపీ సాధిస్తుందని సర్వేలు
చెబుతున్నాయి. కాషాయంలో ఉన్న ఎల్లో బ్యాచ్‌కి టీడీపీ రెడ్‌లో ఉండటంతో నిద్ర
పట్టడం లేదు. లోకేష్, చంద్రబాబు గెలిస్తే తంతాం, బట్టలూడదీస్తాం అంటూ అసభ్య
పదజాలంతో దూషిస్తున్నారు. టీడీపీలో అందరూ సంఘ విద్రోహ శక్తులే ఆ పార్టీకి
క్రెడిబిలిటీ లేదు. విజన్ 2047 చంద్రబాబుది కాదు.. నీతి ఆయోగ్ ది. చంద్రబాబు
అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్నాడని విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.
చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైసీపీ గెలిచింది.
లోకేష్, చంద్రబాబు సులభ్ కాంప్లెక్స్ వ్యాపారం చేసుకోవచ్చు. ప్రజల డబ్బుతో
కట్టిన రిషికొండ లో భవనాలను ఎందుకు కూలుస్తారు. చంద్రబాబు, లోకేష్ ఏపీ
అభివృద్ధి నిరోధకులు. టీడీపీ అధికారంలో రావటం కల్ల. సీఎంనే అయ్యన్న అసభ్య
పదజాలంతో దూషిస్తున్నాడు. అయ్యన్న పాత్రుడు కాదు.. అర గుండు పాత్రుడు ఏదో
మాట్లాడుతున్నాడు. చిలుకలూరి పేట సమావేశం జరిగినప్పుడు ముగ్గురిమే ఉన్నాం.
మేము ఏం మాట్లాడుకున్నామన్నది ఏదో ఊహించుకొని రాయటం తప్పు. పల్నాడు జిల్లాలో
ఏడు అసెంబ్లీ, ఎంపీ స్థానాన్ని గెలవబోతున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా
వ్యక్తం చేశారు.