విజయవాడ : ఇటీవల బెర్లిన్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్,
ప్యారిస్‌లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్‌లో పలు పతకాలు సాధించిన జ్యోతి సురేఖను
సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు తాను సాధించిన పతకాలను
సీఎం వైఎస్ జగన్‌కు సురేఖ చూపించారు. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్
ప్రతిష్టను వెలుగెత్తిచాటడంపై సురేఖను సీఎం వైఎస్ జగన్ ప్రశంసించారు. తనకు
డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి సురేఖ కృతజ్ఞతలు
తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు
అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని, రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో
ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా
సురేఖ వెంట తండ్రి వెన్నం సురేంద్ర కుమార్ సీఎంను కలిశారు.