అమరావతి : ఎపి ఇఎపిసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి బుధవారం 253
కళాశాలల్లో 94, 580 మందికి సీట్లు కేటాయించినట్లు సాంకేతిక విద్యా శాఖ కమీషనర్
, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కన్వీనర్ కోటాలో మొత్తం
1,21,306 సీట్లు ఉండగా, తొలి విడత కేటాయింపులు పోనూ మిగిలిన 26,726 సీట్లను
తదుపరి కౌన్సిలింగ్ లో భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,986 మంది
విద్యార్ధులు 31,36,318 ఆఫ్షన్లను నిర్దేశించుకోగా నిబంధనల మేరకు అయా
కళాశాల్లో సీట్లు కేటాయించామని నాగరాణి వివరించారు. 26 విశ్వవిద్యాలయ
కళాశాలలకు గానూ 5813 సీట్లు, 221 ప్రవేటు కళాశాలల్లో 84,986 సీట్లు, ఆరు
ప్రవేటు విశ్వవిద్యాలయాల్లో 3811 సీట్లు భర్తీ చేసామన్నారు. 530 సీట్ల భర్తీకి
సంభందించి క్రీడా ప్రాధికార సంస్ధ నుండి జాబితాలు రానందున ఆ కేటాయింపులు
జరపలేదని, త్వరలోనే భర్తీ చేస్తామని కన్వీనర్ పేర్కొన్నారు.