ిరోమణి అకాలీదళ్ ఆరోపణ
హర్యానా సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (హెచ్ఎస్జిఎంసి)ని హర్యానా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని శిరోమణి అకాలీదళ్ శుక్రవారం ఆరోపించింది. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు రాష్ట్రంలోని గురుద్వారాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆ పార్టీ స్పందించింది. అకాలీదళ్కు కొత్త పరిణామాలు ఆశ్చర్యం కలిగించడం లేదన్నారు. ఎందుకంటే బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం హెచ్ఎస్జిఎంసి.. అధికారాలను చేజిక్కించుకోవాలని కోరుకుంటున్నదన్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి, మాజీ మంత్రి దల్జిత్ సింగ్ చీమా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.