99.05శాతం హామీలను అమలు చేశాం
అంటరానితనం మీద యుద్ధాన్ని ప్రకటించాం
పేదలు గెలిచే వరకూ…వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ
వేడుకలు
విజయవాడ : ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం నవరత్నాల పాలన అని ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 99.05శాతం హామీలను అమలు
చేశామని తెలిపారు. 50 నెలల్లో డీబీటీ ద్వారా రూ. 2.31 లక్షల కోట్ల లబ్ధి
చేరుకోగా 2 లక్షల 6 వేల 638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసినట్లు
పేర్కొన్నారు. మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం జగన్ మోహన్
రెడ్డి అనంతరం ప్రసంగించారు.పంట నష్టపోతే ఆ సీజన్లో పరిహారం
అందిస్తున్నామన్నారు. ఆక్వా జోన్లలో ఉన్న రైతులకు రూపాయిన్నరకే విద్యుత్
ఇస్తున్నమని చెప్పారు. పాల రైతుల కోసం పాలవెల్లువ కార్యక్రమం తీసుకొచ్చామని,
పాల ధర లీటర్‌కు రూ. 10 నుంచి రూ. 22 వరకు పెంచినట్లు తెలిపారు.
ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టుల పూర్తి : ‘‘గాంధీజీ ఇచ్చిన అహింస, శాంతి
సందేశాన్ని భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్ సాహసాన్ని, టంగూటూరి, అల్లూరి,
పింగళి త్యాగనిరతిని, లక్షలాది సమరయోధుల బలిదానాన్ని గుర్తుచేస్తూ మన జాతీయ
జెండా ఎగురుతోంది. ఈ జెండాకు రాష్ట్ర ప్రజల తరపున సెల్యూట్ చేస్తున్నామని
సీఎం అన్నారు.
గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం : 50 నెలల తమ ప్రభుత్వ పాలనలో గ్రామ
స్వరాజ్యానికి అర్థం తెచ్చామని జగన్ చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ
వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని గొప్ప
మార్పు ఇది అని వివరించారు. ‘‘ఆక్వా రైతులను రూ.1.50కే విద్యుత్ ఇస్తున్న
ప్రభుత్వం మనదే. పాడి రైతులకు పాలవెల్లువ కార్యక్రమం తీసుకొచ్చాం. మూతబడిన
చిత్తూరు డెయిరీతో పాటు సహకార సంఘాలకు జీవం పోశాం. భూవివాదాల ఆస్కారం లేకుండా
రైతన్నకు మంచి చేస్తున్నాం. 1.54లక్షల ఎస్టీ రైతులకు 3.23లక్షల ఎకరాల్లో
పట్టాలు పంపిణీ చేశామన్నారు.
2025 జూన్ నాటికి పోలవరం పూర్తి : ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులను
పూర్తిచేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగంగా సాగుతున్నాయి.
వంశధార ఫేజ్-2, వంశధార- నాగావళి అనుసంధానం పనులు చేపట్టాం. పోలవరం ప్రాజెక్టు
పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025 జూన్ నాటికి పోలవరం పూర్తిచేస్తాం.
వెలుగొండ మొదటి టన్నెల్ పూర్తిచేశాం. రెండో టన్నెల్ పనులు త్వరలోనే
పూర్తవుతాయని జగన్ అన్నారు.
మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశామని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ
వర్గాలకు 68 శాతం మంత్రి పదవులు కల్పించినట్లు వెల్లడించారు. శాసన సభ
స్పీకర్‌గా బీసీ, శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీని నియమించినట్లు చెప్పారు. 139
బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టుల నిర్మాణం ప్రారంభమైనట్లు సీఎం తెలిపారు.
భోగాపురం అంతార్జాతీయ విమానాశ్రయ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్
డూయింగ్ బిజినెస్‌లో వరసగా మూడేళ్లు ఏపీనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు.
రాష్ట్రానికి రూ. 67,196 కోట్ల పెట్టుబడులు రాగా.. కొత్తగా 127 భారీ
పరిశ్రమల ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో
రూ. 13.42 లక్షల కోట్లకు ఎంవోయూలు చేసుకున్నామని, కొత్తగా ప్రారంభమైన
ఎంఎఎస్‌ఎంఈ యూనిట్లు 2,00,995 అని చెప్పారు.
విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు : విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు అమలు
చేస్తున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నాడు-నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల
రూపురేఖలు మారగా.. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగీష్ మీడియం అమలు చేస్తున్నట్లు
తెలిపారు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానం.. ఎనిమిదో తరగతి పిల్లలకు
ట్యాబ్‌లు అందజేస్తున్నామన్నారు. భోజనం, వసతి ఖర్చుల కోసం రూ.20 వేల వరకు వసతి
దీవెన అందిస్తున్నామని.. రోజుకో మెనూతో పౌష్టికాహారంగా గోరుముద్ద అమలు
చేస్తున్నామని చెప్పారు. డిగ్రీ స్థాయిలో 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్
ఇస్తున్నట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లో పెండింగ్‌లో ఉన్న 3295 టీచింగ్
పోస్టుల భర్తీ చేసినట్లు పేర్కొన్నారు.
అంటరానితనం మీద యుద్ధాన్ని ప్రకటించాం : పేదలు చదివే స్కూళ్లను పాడుబడేలా
చేయడం అంటరానితనమేనని సీఎం జగన్ అన్నారు. పేదలు ఇంగ్లీష్ మీడియాం
చదువుకోవద్దని వాదించడం అంటరానితనమే, పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ
ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితనమే, పేదలకు ఇళ్లు
ఇవ్వకూడదని అడ్డుకోవడం కూడా అంటరానితనమే, పేదల సహనాన్ని పరీక్షించడం కూడా
అంటరాని తనమే, పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధమని
స్పష్టం చేశారు.
17 ప్రభుత్వ మెడికలు కాలేజీలు : వైద్యశాఖలో ఏకంగా 53, 126 పోస్టుల భర్తీ
చేసినట్లు వైఎస్ జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికలు
కాలేజీలు నిర్మిస్తున్నామని, 108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాల కొనుగోలు
చేసినట్లు చెప్పారు.
గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు : స్వాతంత్ర్య సమరయోధుల
బలిదానాన్ని గుర్తు చేస్తూ మన జాతీయ జెండా ఎగురుతోందని సీఎం జగన్
పేర్కొన్నారు. 76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగమించిందని, వ్యవసాయం,
పరిశ్రమ, సేవారంగంలో ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు. రాష్ట్రంలో 50 నెలల్లో
గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామని చెప్పారు. గ్రామాల్లో విలేజ్
క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు తెచ్చామని, పౌర సేవల్ని ఇంటింటికి
తీసుకెళ్లగలిగామని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను
తెచ్చామన్నారు.