ప్రస్తుతం చాలా మంది మహిళలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఐరన్
లోపంతో అనేక సమస్యలు వస్తాయి. రక్తహీనత సమస్యను దూరం కావాలంటే ఐరన్ కంటెంట్
అధికంగా ఉన్న పదార్థాలను తినడం ఉత్తమం. ఈ పదార్థాలలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా
ఉంటుంది.
1.షెల్ ఫిష్:
షెల్ ఫిష్ లో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల షెల్ ఫిష్ ను తినడంతో
రోజులో కావాల్సిన ఐరన్ లో 17 శాతం లభిస్తుంది. రక్తహీనత సమస్య రాదు.
2.పాలకూర
పాలకూర తినడంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ సులభంగా అందుతాయి. పాలకూర
తినడంతో శరీరానికి కావాల్సిన ఐరన్ 15 శాతం అందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
3.మాంసం:
మాంసం, లివర్ తినడంతో శరీరానికి కావాల్సిన ఐరన్ సులభంగా అందుతుంది. వీటిని
తినడంతో శరీరానికి అవసరమయ్యే ఐరన్ 36 శాతం లభిస్తుంది.
4.చిక్కుడు:
చిక్కుడు గింజలు తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో పోషకాలు పుష్కలంగా
ఉంటాయి. వీటిలో ఐరన్ తో పాటు ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం కూడా లభిస్థాయి.
వ్యాధినిరోధకశక్తి కూడా మెరుగుపడుతుంది.
5.గుమ్మడి విత్తనాలు:
గుమ్మడి విత్తనాలు తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక ఔన్స్ గుమ్మడి
విత్తనాలు తినడంతో శరీరానికి కావాల్సిన ఐరన్ 14 శాతం అందుతుంది. ఇందులో
పోషకాలు సైతం పుష్కలంగా ఉన్నాయి.
6.క్వినోవా:
క్వినోవా తినడంతో శరీరానికి కావాల్సిన ఐరన్ కంటెంట్ సులభంగా అందుతుంది. ఇందులో
ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గ్లుటెన్ రహితం. కాబట్టి గ్లుటెన్
అలెర్జీ ఉన్న వారు కూడా దీనిని తినవచ్చు.
7.బ్రోకలి:
బ్రోకలి తినడంతో శరీరానికి కావాల్సిన పోషకాలు సులభంగా అందుతాయి. బ్రోకలిని
తినడంతో శరీరానికి కావాల్సిన ఐరన్ ఆరు శాతం అందుతుంది. ఇందులో విటమిన్ సీ, కే,
ఫోలేట్ కూడా లభిస్తుంది.
8.గుడ్లు:
గుడ్లు, మాంసంలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. గుడ్లు తినడంతో ఆరోగ్యం
మెరుగుపడుతుంది. గుడ్లలో అన్ని రకాల విటమిన్లు, పోషకాలు ఉంటాయి. గుడ్లని తినడం
వల్ల రక్తహీనత సమస్య తలెత్తకుండా ఉంటుంది.