విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు ఆగస్టు 15
కాదని, ఆగస్టు 9 అని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. సోమవారం ఆయన
మీడియాతో మాట్లాడుతూ పుట్టని రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న వెల్లంపల్లి
వ్యవహారం చూస్తుంటే బ్రహ్మానందం దీపావళి పండగను వినాయక చవితి రోజున చేసుకున్న
పెళ్లి చేసుకుందాం సినిమా సీను గుర్తొస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. హిందూ
హైస్కూల్లో చదివిన టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు బయటపెట్టి నిజాయితీ
నిరూపించుకోవాలని వెల్లంపల్లికి సవాల్ విసిరారు. మీరు 2014, 2019 ఎన్నికల
అఫిడవిట్లో టెన్త్ క్లాస్ అని డిక్లరేషన్ ఇచ్చారు. ఆ ఆధారంతోనే నేను
వెల్లంపల్లి శ్రీనివాసరావును ప్రశ్నిస్తున్నా. స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు
చేసిన వారినీ ఘోరంగా అవమానిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావును ప్రజల
క్షమించవద్దని పోతిన వెంకట మహేష్ వ్యాఖ్యలు చేశారు.