విజయవాడ : దేశ విభజన భయానక స్మారక దినం సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో లో
కొవ్వొత్తులతో ర్యాలీ ని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
ప్రారంభించారు. దేశ విభజన అనంతరం ప్రాణాలు కోల్పోయిన వారికి దగ్గుబాటి
పురంధరేశ్వరి, ఇతర బిజెపి నేతలు నివాళి అర్పించారు. బి ఆర్టి యస్ రోడ్ లో
నిర్వహించిన కాగడాలు, కొవ్వొత్తుల ర్యాలీలో దగ్గుబాటి పురంధరేశ్వరి
పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ ఆగష్టు 14న దేశ
విభజన కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, నేటి తరం వారికి మన చరిత్ర
తెలియాలనే దేశ విభజన ఘటనలను వివరిస్తూ ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మనం
విడిపోవడం వల్ల ఎంతో నష్ట పోయామని, విభజన వల్ల మన సౌభ్రాతృత్వానికి విఘాతం
కలిగిందన్నారు. కేంద్రం ఆదేశాలతో దేశ వ్యాప్తంగా విభజిత్, విభీషణ్ కార్యక్రమం
చేపట్టామని, ఆగస్టు 15న ప్రతి ఇంటి పైన తిరంగా రన్, త్రివర్ణ పతాకాన్ని ఎగుర
వేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరారు.