విజయవాడ : రాష్ట్రస్ధాయి స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ
మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం
సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను
ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను
కూడా స్టేడియంలో సిద్దం చేశారు. ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న
దృష్ట్యా ఆహ్వనితులు, పాస్లు ఉన్నవారు ఉదయం 8 గంటలకల్లా సభా ప్రాంగణంలో
కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమం అనంతరం
సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చే తేనీటి విందు (ఎట్
హోమ్) కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు