ఒమైక్రాన్ బీఏ 2 సబ్‌వేరియంట్ తీవ్రత డెల్టా వేరియంట్ కంటే తక్కువని, అలాగే అసలు ఒమైక్రాన్ వేరియంట్ కంటే చాలా ఎక్కువని యూఎస్ -ఆధారిత మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకుల నేతృత్వంలోని పరిశోధన బృందం వెల్లడించింది.
2020 మార్చి 3 నుంచి ఈ సంవత్సరం జూన్ 20 వరకు యూఎస్ లో ధృవీకరించబడిన 1,02,315 కొవిడ్-19 కేసుల్లో 20,770 డెల్టా వేరియంట్లుగా గుర్తించారు.. అలాగే 52,605 ఒమైక్రాన్ బీ, వేరియంట్లుగా 11,529 లేబుల్ చేయబడ్డాయి, అసలు ఒమైక్రాన్ వేరియంట్ 90, ఒమైక్రాన్ బీ ఏ.2 సబ్వేరియంట్లుగా 28 కేసులను పరిశోధకులు కనుగొన్నారు. మరణాల రేటు
డెల్టాలో 0.7 శాతం, ఒరిజినల్ ఒమైక్రాన్ వేరియంట్‌కు 0.4 శాతం, ఒమైక్రాన్ బీ ఏ.2కి 0.3 శాతం ఉందన్నారు.