మొబైల్ బ్యాంకింగ్ నూతన యాప్ లాంచింగ్ చేసిన సిఎస్.డా.కెఎస్.జవహర్ రెడ్డి
అమరావతి : చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వార్షిక నివేదికను విడుదల చేసి
మొబైల్ బ్యాంకింగ్ నూతన యాప్ ను సోమవారం వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ప్రారంభించారు. ఈమేరకు సోమవారం వెలగపూడిలోని
రాష్ట్ర సచివాలయంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అధ్యక్షులు
టి.కామేశ్వరరావు తోపాటు ఆబ్యాంకు అధికారులు సిఎస్ ను కలిశారు. ఈసందర్భంగా
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు 2022-23 ఆర్దిక సంవత్సర వార్షిక నివేదికను
విడుదల చేసి మొబైల్ బ్యాంకింగ్ నూతన యాప్ ను సిఎస్ ప్రారంభించారు.ఈ సందర్బంగా
సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ 8 జిల్లాలో 249 శాఖలతో 27 లక్షల మంది
ఖాతదారులకు ఘననీయమైన సేవలందిస్తన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సేవలను ఆయన
ప్రత్యేకంగా కొనియాడారు.గత ఆర్థిక సంవత్సరానికి 17,582 కోట్ల వ్యాపారంతో
అత్యుత్తమ ఫలితాలు సాధించిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అధికారులు
సిబ్బందికి మరియు ఖాతాదారులకు సిఎస్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.అదే విధంగా
ఖాతాదారుల సౌకర్యార్ధం మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని మరింత సులభతరంగా
అందించేందుకు సీసీజీబీ మనీ 2.0 యాప్ ఆవిష్కరించటం మంచి శుభ పరిణామమని
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చైతన్య
గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ టి.కామేశ్వరరావు మాట్లాడుతూ తమ బ్యాంకు
కనబరిచిన ఈ ఫలితాలు ఖాతాదారులకు మా పని తీరుపై ఉన్న నమ్మకానికి నిదర్శన
మన్నారు.అంతేగాక బ్యాంకు సిబ్బంది యొక్క నిబద్దతకు,అంకితభావానికి అద్దంపట్టేలా
ఉన్నాయని ఆనందంవ్యక్తంచేసారు. ఈకార్యక్రమంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు
జనరల్ మేనేజర్లు డా.బివి. రమణారావు, పి.మారుతీ రావు, ఆర్.యం.పి.వి రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.