ఉద్యోగులను శాశ్వితంగా ప్రాతిపదికన పంపకం చేసేటప్పుడు, ముందుగా ఉద్యోగుల నుండి
ఆప్షన్ తీసుకుని తర్వాత పరిపాలన సౌలభ్యం కొరకు చర్యలు తీసుకోవాలి
ఈ జోన్లు వారిగా ఉద్యోగుల పంపకాలు జరిగేటప్పుడు ఉద్యోగుల సీనియర్టీ
అడిక్వేసీ తదితర అంశాలపై ఎవరికి నష్టం జరుగకుండా చూడాలి
ఏపిజేఏసి అమరావతి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు , పలి శెట్టి దామోదరరావు
గుంటూరు : ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన నేపద్యంలో తదుపరి
పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్ల వ్యవస్దను ఆరు జోన్లు గా
ఏర్పాటు, ఉద్యోగుల పంపకం, స్థానికత తదితర అంశాలతో కూడిన రాష్ట్రపతి ఉత్తర్వులు
(ప్రెసిడెన్సీయల్ ఉత్తర్వులు-1975) పై మార్పులు చేర్పులు ప్రభుత్వం
ప్రతిపాదించిన నేపద్యంలో ఏపీ జేఏసీ అమరావతి మరియు ఏపీ రెవెన్యూ సర్వీసెస్
అసోసియేషన్ పక్షాన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులును
ఆయాజోన్లుకు శాశ్విత ప్రాతికపదిగా అల్లోట్మెంట్ చేసేటప్పుడు వారికి ముందుగా
“ఆఫ్సన్” సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని, సీనియారిటీ లో ఎలాంటి నష్టం
జరుగకుండా చూడాలని, అలాగే అడిక్వేసీ (రూల్ ఆఫ్ రిజర్వేషన్ ) విషయాన్ని
చూడాలని, ఏ ఒక్కఉద్యోగిని అసంతృప్తికి గురిచేయాకుండా చూడాల్సి బాద్యతలను
ముందు తీసుకొని తదుపరి పరిపాలనా సౌలభ్యం కోసం ఉద్యోగులను అలోట్మెంట్ పూర్తి
చేయాలని ప్రతిపాదించామని సోమవారం సచివాలయంలో జోన్లువ్యవస్ద లో
మార్పుచేర్పులపై ఉద్యోగసంఘాలతో సియస్ అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల
సమావేశంలో పాల్లొన్న ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టివి
ఫణి పేర్రాజు, కోశాధికారి వి.వి మురళికృష్టనాయుడు తెలిపారు.
ఈ కొత్త జోన్ల విషయంలో ప్రధానంగా ఇప్పటివరకు జోన్ -I లో ఉండి ప్రస్తుతం జోన్
-II లోకి చేరనున్న ఉన్న అల్లూరిసీతారామరాజుజిల్లా (పాడేరు), ఇప్పటివరకు జోన్
-III లో ఉండి ప్రస్తుతం జోన్ -V లోకి చేరనున్న ఉన్న గూడూరు, సూళ్లురుపేట
ఉద్యోగుల పిల్లలకు స్థానికత విషయంలో ఎలాంటి నష్టం జరుగకుండా చూడాల్సిన
బాద్యతకూడాఉందని తెలిపారు. అలాగే హైదరాబాద్ లో పనిచేసి విజయవాడ వచ్చిన
ఉద్యోగుల పిల్లలకు స్థానికత విషయంలో కనీసం పది సంవత్సరాలపాటు కొనసాగించాలని,
రెవిన్యూ విభాగంలో డిప్యూటీ తహశీల్దార్ పోస్టును జిల్లా స్థాయిలోను,
తహశీల్దార్ పోస్ట్ ను జోనల్ స్థాయిలో కొనసాగించాలని తెలిపారు. ప్రభుత్వం
జోన్ల వ్యవస్దలో చేస్తున్న మార్పులను స్వాగతిస్తునే ఉద్యోగులకు ఎటువంటి నష్టం
జరగకుండా చూడాల్సి న బాధ్యత ప్రభుత్వం పై ఉందని ఈ సమావేశంలో గట్టిగా ఏపిజేఏసి
అమరావతి పక్షాన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళామని, అలాగే గురువారం
సాయింత్రం లోపు లిఖిత పూర్వకంగా ప్రతిపాధనలు కూడా ఇస్తామని బొప్పరాజు
వెంకటేశ్వర్లు తెలిపారు.