గ్రామాల్లో పలువురి కుటుంబాలను రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ
మంత్రి డాక్టర్ తానేటి వనిత పరామర్శించారు. వివిధ గ్రామాల సర్పంచ్ లు,
నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు సాధారణ ప్రజలు కూడా పరామర్శించిన వారిలో
ఉన్నారు. అనారోగ్య కారణంగా చికిత్సపొందిన వారి ఆరోగ్య విషయాలను ఆరా తీశారు.
అదేవిధంగా ఇటీవల మృతి చెందిన పలువురికి ప్రగాడ సానుభూతిని తెలియజేస్తూ వారి
కుటుంబ సభ్యులను ఓదార్చారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభమైన
హోంమంత్రి ఒకే రోజున 9 మంది కుటుంబాలను పరామర్శించారు. రాష్ట్ర మంత్రిగా
ఎన్ని బాధ్యతలు ఉన్నా.. కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల యోగక్షేమాలు
ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటానని తెలిపారు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని ధైర్యంగా
ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు. వారి కుటుంబాలకు ఒక ప్రజా ప్రతినిధిగా,
కుటుంబ సభ్యురాలిగా వారందరికీ తోడుగా, అండగా ఉంటానని హోంమంత్రి
భరోసానిచ్చారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా హోంమంత్రి తానేటి వనిత
పరామర్శలు జరగడం గమనార్హం.
హోంమంత్రి తానేటి వనిత పరామర్శించిన కుటుంబ వివరాలు : మొదటిగా చాగల్లు మండలం
ఊనగట్ల సర్పంచ్ మట్టా వెంకట్రావును కలిసి తన ఆరోగ్య పరిస్థితిపై వివరాలను
తెలుసుకున్నారు. తర్వాత అదే గ్రామానికి చెందిన వావుళ్లపల్లి పోలరాజు కాలు
విరిగి మంచాన ఉండడంతో ఆయన్ను పరామర్శించారు. అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షుడు
పిల్లి నాగరాజు అనారోగ్య పరిస్థితి వివరాలను తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుడూరి జయ గణేష్ కుటుంబ సభ్యులను హోంమంత్రి
పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి కుటుంబ సభ్యులను ప్రగాడ సానుభూతిని వ్యక్తం
చేశారు. అనంతరం నందిగంపాడు సర్పంచ్ కుదపా రాంబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆరా
తీశారు. అనంతరం కలవలపల్లిలో గూడపాటి శివన్నారాయణ ఇంటిని సందర్శించి ఆయన తండ్రి
గూడపాటి కృష్ణారావు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గగ్గర
ప్రసాద్ ఇంటికెళ్లి ఇటీవల మృతి చెందిన గగ్గర సత్యవతికి నివాళులు అర్పించారు.
అలాగే చల్లా చంద్రరావు ఇంటికి వెళ్లి ఆయన తల్లి చల్లా అనంతలక్ష్మి
చిత్రపటానికి పూలు వేసి నివాళుర్పించారు. చివరిగా దిగుమర్తి నాగరాజు ఇంటిని
సందర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి హోంమంత్రి ఆరా తీశారు. కాసేపు కుటుంబ సభ్యుల
యోగక్షేమాలను కనుక్కొన్నారు.