కొవ్వూరు : దివ్యాంగులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లాలన్నా చాలా
కష్టపడే వారని, వారికి చేదోడుగా సహాయకారిగా ఉండేందుకు ఉచితంగా మూడు చక్రాల
మోటార్ సైకిల్స్ అందచేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ
మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయం
ఆవరణలో కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన 10 మంది దివ్యాంగులకు మోటార్ ట్రై
సైకిల్స్ (పెట్రోల్ వాహనాలు) పంపిణీ చేశారు. దివ్యాంగులతో కాసేపు ముచ్చటించి
వారి యోగక్షేమాలను ఒక్కొక్కరినీ అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి
తానేటి వనిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతితో పాటు
దివ్యాంగుల సంక్షేమం, వారి ఆర్థికాభివృద్ది కోసం ప్రభుత్వం కృషి
చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి ఒక
అన్నలా, తమ్ముడిలా, ఒక కొడుకుగా బాధ్యత తీసుకుని సేవలందిస్తున్నారని తెలిపారు.
దివ్యాంగుల విద్యార్థిభివృద్ది, వ్యాపారాభివృద్ధి కోసం ట్రై సైకిల్స్
ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. వీటి ద్వారా వారిలో ఆత్మ విశ్వాసం పెంచడం
ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఒక్కో ట్రై సైకిల్ కోసం రూ.1 లక్షా 20 వేలు
వెచ్చించినట్లు ఆమె తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, వెనుకబడిన
వర్గాల, నిరుపేద కుటుంబాలతో పాటు దివ్యాంగులకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు
ప్రవేశపెట్టిందన్నారు. మన ప్రభుత్వం అభివృద్ధి పనులుతో పాటు సంక్షేమానికి
నిదర్శనం ఇటువంటి కార్యక్రమాలనేనని హోంమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో
విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్దుల సహాయ సంస్థ (ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ
ఎబుల్డ్ & సీనియర్ సిటిజన్ అసిస్టెన్స్ కార్పోరేషన్) ఛైర్ పర్సన్ ముంతాజ్
పఠాన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్దిదారుల కుటుంబ
సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.