సౌదీ అరేబియాతో భద్రతా సహకార ఒప్పందంపై బంగ్లాదేశ్ సంతకం చేయనుంది. వచ్చే నెలలో సౌదీ అరేబియా డిప్యూటీ అంతర్గత మంత్రి నాసర్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ దావూద్ ఢాకా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ఢాకాలోని సౌదీ రాయబారి ఇసా బిన్ యూసుఫ్ అల్ దుహైలాన్ బుధవారం (అక్టోబర్ 26) విదేశాంగ మంత్రి ఎకె అబ్దుల్ మోమెన్తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరు దేశాల సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఈ పర్యటన మంచి సందేశాన్ని ఇస్తుందని తాను ఆశిస్తున్నట్లు అబ్దుల్ మోమెన్ తెలిపారు. ఈ పర్యటనలో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారని విలేకరులు ప్రశ్నించగా.. భద్రతా సహకార ఒప్పందం ఉంటుందని చెప్పారు. అందులో ఏమేమి ఉంటాయి అని అడిగితే, ఇన్ఫర్మేషన్ సప్లై, డేటా వెరిఫికేషన్ వంటి విషయాలు ఉంటాయని చెప్పారు. 2.6 మిలియన్ల బంగ్లాదేశీయులు సౌదీ అరేబియాలో నివసిస్తున్నారు. వారికి భద్రత కల్పించడంపై విదేశాంగ మంత్రిని ప్రశ్నించగా.. సౌదీ అరేబియాతో భద్రతా ఒప్పందం ఉంటుందని పేర్కొన్నారు.