అడపా దడపా వర్షం, తుఫాను ‘సిత్రంగ్’ హెచ్చరికలతో దీపావళి రోజు కోల్కతాలో వాయు కాలుష్య స్థాయిలు తగ్గాయి. అయినప్పటికీ బాణసంచా వినియోగాన్ని, శబ్ద కాలుష్యాన్ని పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ రాజధానిలో అవి నిరోధించలేకపోయాయి..
కాళీపూజ-దీపావళి రోజు సాయంత్రం కోల్కతా అంతటా వాయు కాలుష్య స్థాయి గత మూడేళ్లలో ఉన్నదానికంటే “చాలాతక్కువ” అని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి (WBPCB) అధికారి మంగళవారం తెలిపారు. .
‘సిత్రంగ్’ తు ఫాను ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి అడపాదడపా కురుస్తున్నజల్లులే వాయు కాలుష్యం తగ్గు ముఖం పట్టడానికి కారణమని ఆయన చెప్పారు. .
రైతులకు పంట నష్ట పరిహారం చెల్లిస్తాం : మహారాష్ట్ర సీఎం షిండే .
రైతులకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే హామీ ఇచ్చారు. దక్షిణ ముంబైలోని తన అధికారిక నివాసం ‘వర్ష’లో రైతులను ఉద్దేశించి మంగళవారం ఆయన మాట్లాదారు. ఈ సందర్భంగా అన్నదాతలుగా ఆయన వారిని అభివర్ణించారు. అలాంటివారు అకాల వర్షాలతో నష్టపోయారన్నారు. అకాల, అధిక వర్షాలతో పంటనష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. .
తమ ప్రభుత్వం వ్యవసాయదారులకు అండగా నిలుస్తుందన్నారు. అకాల వర్షాల వల్ల రైతులకు జరిగిన పంట నష్టాని కి పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు .