బెంగళూరులో బాంబు దాడికి పథకం రచించిన ఐదుగురు అనుమానిత ముష్కరులను అరెస్ట్
చేశారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు
పోలీసులు తెలిపారు. బెంగళూరులో బాంబు దాడికి ప్లాన్ చేసిన ఐదుగురు అనుమానిత
ఉగ్రవాదులను కర్ణాటక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను
సయ్యద్ సుహేల్, ఉమర్, జానిద్, ముదాసిర్, జాహిద్‌లుగా గుర్తించారు. 2017 నాటి ఓ
హత్య కేసులో వీరంతా నిందితులని, పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో వీరికి
ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని సీసీబీ తెలిపింది. నిందితుల వద్ద నుంచి పేలుడు
పదార్థాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. నిందితుల వద్ద ఏడు
దేశీయ తుపాకులు, 42 లైవ్ బుల్లెట్లు, మందుగుండు, రెండు కత్తులు, రెండు
శాటిలైట్ ఫోన్లు, నాలుగు గ్రెనేడ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం
మదివాలా టెక్నికల్ సెల్లో నిందితులను తీవ్రంగా ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.
నిందితుల మొబైల్ ఫోన్లను తనిఖీ చేస్తున్నామని, అందులోని సమాచారంతో మరిన్ని
వివరాలు తెలిసే అవకాశం ఉందని వివరించారు.
ముఖ్యాంశాలు
రాష్ట్రం
మీ జిల్లా
భారత్
సితార
చిత్రమాలిక
వీడియోలు
నేరాలు
ఛాంపియన్
వాణిజ్యం
ప్రపంచం
సాంకేతికం
సుఖీభవ
విశ్లేషణ
HOME/
TELANGANA/
BHARAT/
PLAN TO BOMB BLAST IN BENGALURU CENTRAL CRIME BRANCH ARRESTED 5 SUSPECTED
TERRORISTS
భారీ ఉగ్ర కుట్ర.. బెంగళూరులో పేలుళ్లకు ప్లాన్.. ఐదుగురు ‘ముష్కరులు’ అరెస్ట్
Updated: Jul 19, 2023, 11:32 AM
Published: Jul 19, 2023, 10:48 AM
Etv Bharat
భారీ ఉగ్ర కుట్రను కర్ణాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఛేదించారు.
బెంగళూరులో బాంబు దాడికి పథకం రచించిన ఐదుగురు అనుమానిత ముష్కరులను అరెస్ట్
చేశారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు
పోలీసులు తెలిపారు.
బెంగళూరులో బాంబు దాడికి ప్లాన్ చేసిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్ణాటక
క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను సయ్యద్ సుహేల్, ఉమర్,
జానిద్, ముదాసిర్, జాహిద్‌లుగా గుర్తించారు. 2017 నాటి ఓ హత్య కేసులో వీరంతా
నిందితులని, పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో వీరికి ఉగ్రవాదులతో పరిచయం
ఏర్పడిందని సీసీబీ తెలిపింది. నిందితుల వద్ద నుంచి పేలుడు పదార్థాలను సైతం
స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
// //నిందితుల వద్ద ఏడు దేశీయ తుపాకులు, 42 లైవ్ బుల్లెట్లు, మందుగుండు, రెండు
కత్తులు, రెండు శాటిలైట్ ఫోన్లు, నాలుగు గ్రెనేడ్లు ఉన్నాయని అధికారులు
తెలిపారు. ప్రస్తుతం మదివాలా టెక్నికల్ సెల్లో నిందితులను తీవ్రంగా
ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. నిందితుల మొబైల్ ఫోన్లను తనిఖీ చేస్తున్నామని,
అందులోని సమాచారంతో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని వివరించారు.
ఇదే కేసులో సంబంధం ఉందని భావిస్తున్న మరో ఇద్దరికోసం గాలింపు చేపట్టినట్లు
పోలీసులు తెలిపారు. వారి గురించిన సమాచారం తమకు అందిందని, పోలీసు బృందాలు
వారిని వెతుకుతున్నాయని చెప్పారు. ఈ అరెస్ట్‌తో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు
అడ్డుకున్నట్లైంది. భారీ స్థాయిలోనే నిందితులు బాంబు దాడికి ప్రణాళికలు
రచించినట్లు తెలుస్తోంది. పది మందికి పైగా కలిసి నగర వ్యాప్తంగా దాడులకు
ప్లాన్ చేసినట్లు సమాచారం. బాంబు తయారీకి అవసరమైన ముడి వస్తువులన్నింటినీ
నిందితులు సమకూర్చుకున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి ఇంటెలిజెన్స్
ఏజెన్సీకి పక్కా సమాచారం అందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమాచారాన్ని
బెంగళూరు సీసీబీ టీమ్‌కు చేరవేసినట్లు వెల్లడించాయి. వెంటనే అప్రమత్తమైన
బెంగళూరు సీసీబీ బృందాలు.. అనుమానిత ఉగ్రవాదుల లొకేషన్‌ను ట్రేస్ చేసి అరెస్ట్
చేశాయి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఎన్ఐఏ, సీసీబీలు సంయుక్తంగా ఈ ఆపరేషన్
చేపట్టాయి.