ఐక్యరాజ్య సమితి : ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఐక్యరాజ్యసమితి (ఐరాస)
ఉన్నతస్థాయి వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఐరాస విడుదల చేసిన ఉపన్యాసకుల జాబితా
వెల్లడించింది. ఆ ప్రకారం సెప్టెంబరు 19న సమావేశాలు ప్రారంభం కాగానే తొలిగా
అమెరికా, అనంతరం బ్రెజిల్ దేశాల నేతలు ఉపన్యసిస్తారు. అదే నెల 22న మధ్యాహ్నం
భారత ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ఈ షెడ్యూల్లో చివరి వరకూ
మార్పులు చేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.