గుప్పించింది. పాత మిత్రులే కొత్త పేరుతో ముందుకొచ్చారని దుయ్యబట్టింది.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని సమర్థంగా ఎదుర్కొనేందుకు విపక్షాలు సమాయత్తం
అవుతున్నాయి. ఇందులో భాగంగా కూటమికి ఇండియా అనే పేరును నిర్ణయించాయి.
ప్రతిపక్షాల ఫ్రంట్‌ను ఇకపై ‘భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమిగా
వ్యవహరించనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం
వెల్లడించారు. అయితే, దీనిపై భాజపా స్పందించింది. పాత గ్రూపంతా ఒక్కచోట చేరి
కొత్త పేరుతో వచ్చినంత మాత్రాన విశ్వసనీయత రాదంటూ బీజేపీ ఐటీ సెల్
ఇన్‌ఛార్జి అమిత్ మాలవీయ ఎద్దేవా చేశారు.
విపక్షాల కూటమి పేరు ఇండియా
కూటమికి ‘ఇండియా’ పేరును ఖరారు చేసిన నేపథ్యంలో మాలవీయ మంగళవారం ట్వీట్
చేశారు. ఈ సందర్భంగా విపక్షాల కూటమిపై అమిత్ మాలవీయ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కూటమిని తీవ్రవాద సంస్థతో పోల్చారు. ‘‘సిమి ఉగ్రవాద సంస్థను నిషేధించినప్పుడు
వేరే పేరుతో ఆ గ్రూప్ సభ్యులంతా ఒక్కటయ్యేవారు. అంతమాత్రన వారి స్వభావం
మారదు’’ అంటూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను ఉద్దేశించి మాలవీయ
వ్యాఖ్యానించారు. ‘‘అవినీతికి, తిరోగమన రాజకీయాలకు పెట్టింది పేరైన యూపీఏలో
ఉన్న వారే మరోసారి పేరు మార్చుకుని వస్తున్నారు. అంతమాత్రన విశ్వసనీయత
వస్తుందనుకుంటే పొరపాటే’’ అని పేర్కొన్నారు. అలాంటి వారిని ప్రజలు
తరిమికొడతారని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో మరోసారి నరేంద్రమోదీని
ప్రధానిగా చూడబోతున్నామని చెప్పారు.