అవకాశవాద రాజకీయాలకు మూల్యం చెల్లించక తప్పదు
విద్యుత్ విధానలపై కేంద్రం ప్రశంస
వైయస్సార్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
గుంటూరు : నాలుగేళ్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ
కూడా రాలేదని రాజ్యసభ సభ్యులు, వైయస్సార్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి.
విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సోషల్ మీడియాలో పలు అంశాలపై
స్పందించారు..జగన్ పాలనలో నిధులు అత్యంత పారదర్శకంగా వినియోగం జరుగుతోందని
ఎక్కడా ఎటువంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా సాగుతోందని అన్నారు.రైతులు ఎన్నడూ
లేనంత ధీమాగా, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, ఆసరాలేని వారంతా జగన్
ఎప్పటికీ సీఎం గానే ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు.
టీడీపీవి ఉత్తుత్తి ఉద్యమాలు,హాస్యాస్పద ప్రదర్శనలు : ప్రతిపక్షం ప్రజల కోసం,
ప్రజల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఉద్యమిస్తాయని,నిబద్ధతతో
నిలబడే పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. ఆంధ్ర టీడీపీలో మాత్రం
విచిత్రమైన వాతావరణం కనిపిస్తోందని, విఫలనేత చంద్రబాబు కోసం అంతా పోగవుతారని,
ఆయన ఊ అనగానే ఉత్తుత్తి ఉద్యమాలు, హాస్యాస్పద ప్రదర్శనలు చేస్తారని ఎద్దేవా
చేశారు.
అవకాశవాద రాజకీయాలకు మూల్యం చెల్లించక తప్పదు : ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ
నాయకులు ఎన్ని లాబీయింగులు చేసినా ఎన్డీయే కూటమి సమావేశానికి టీడీపీకి ఆహ్వానం
రాలేదన్నారు. ఈ విషయంలో బిజెపిలోకి పంపించిన కోవర్టులు శతవిధాలా ప్రయత్నించి
భంగపడ్డారని చెప్పారు. చంద్రబాబు తాను ఏ గట్టున ఉన్నాడో తెలియని పరిస్థితిలో
కుమిలిపోతున్నారని ఎద్దేవా చేశారు.. తెలుగుదేశం పార్టీ అవకాశవాద రాజకీయాలకు
ఎప్పటికైనా మూల్యం చెల్లించక తప్పదని చెప్పారు.
విద్యుత్ విధానలపై కేంద్రం ప్రశంస : ఖజానాకు ఏటా 1500 కోట్లు నష్టం వాటిల్లేలా
టీడీపీ ప్రభుత్వ హయంలో చంద్రబాబునాయుడు చేసుకున్న విద్యుత్తు కొనుగోలు
ఒప్పందాలను సిఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షించి తక్కువ ధరకు ఒప్పించినప్పుడు
టీడీపీ నానా యాగీ చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రా విధానాలను ప్రశంసిస్తూ
మిగిలిన రాష్ట్రాలూ వాటిని అమలు చేయాలని తాజాగా కేంద్రం సూచించడం జగన్ ముందు
చూపును మరోసారి తెలియజెప్పిందని విజయసాయిరెడ్డి అన్నారు.