స్పష్టం చేశారు. శివాజీ ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా
కలకలం రేపింది. దీంతో సీఎం జగన్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. మంగళవారం పిల్లి
సుభాష్ ని తాడేపల్లి పిలిపించి కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. కోనసీమ
జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ గ్రూపు రాజకీయాలకు సీఎం జగన్
ముగింపు పలికినట్టే తెలుస్తోంది. ఈరోజు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ని
క్యాంప్ కార్యాలయానికి పిలిపించిన జగన్ గ్రూపు రాజకీయాలు పక్కనపెట్టాలని హితవు
పలికారు. రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సమక్షంలోనే ఎంపీ పిల్లి సుభాష్ కి
జగన్ క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. పిల్లి సుభాష్ తనయుడు సూర్యప్రకాశ్
టికెట్ విషయం తనకు వదిలేయాలన్నారు. ఆయన్ను ఎక్కడినుంచి బరిలో దించాలనే విషయం
తాను చూసుకుంటానన్నారు. విభేదాలు పక్కనపెట్టి మంత్రి వర్గంతో కలసి పనిచేయాలని
ఎంపీ సుభాష్ కి సీఎం జగన్ సూచించారు.
*అసలేం జరిగిందంటే..? : రామచంద్రాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఆ
నియోజకవర్గం నుంచి తన కొడుకు సూర్య ప్రకాశ్ ని వైసీపీ టికెట్ పై బరిలో
దించాలనుకుంటున్నారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. దీంతో ఆ రెండు వర్గాల మధ్య
మాటల యుద్ధం మొదలైంది. చినికి చినికి అది గాలివానలా మారింది. మంత్రికి
వ్యతిరేకంగా ఎంపీ వర్గం ఓ సమావేశం పెట్టుకుంది. ఆ సమావేశంలో మంత్రి, మంత్రి
కొడుకుపై తీవ్ర ఆరోపణలు. చేశారు కూడా. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.
పిల్లి సుభాష్ వర్గానికి చెందిన రామచంద్రాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కోలమూరు
శివాజీపై మంత్రి వర్గానికి చెందిన ఉదయ్ కాంత్ దాడి సంచలనంగా మారింది. దాడి
అనంతరం శివాజీ ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం
రేపింది. దీంతో సీఎం జగన్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. పిల్లి సుభాష్ ని
తాడేపల్లి
పిలిపించి కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారు.*
పార్టీ ప్రయోజనాలే ముఖ్యం : పిల్లి సుభాష్ చంద్రబోస్ ని దూరం చేసుకోవడం సీఎం
జగన్ కి ఇష్టంలేదు. అలాగని ఆయన తనయుడికి రామచంద్రాపురం టికెట్ ఇచ్చి మంత్రి
వేణుగోపాల కృష్ణ వర్గాన్ని చెడ్డ చేసుకోలేరు. అందుకే పార్టీకి నమ్మకంగా ఉన్న
ఎంపీని పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఆయనకోసం పార్టీ ఏమేం చేసిందో
వివరించారు. ఆయన కొడుకు విషయంలో కూడా తాను అంతే బాధ్యతగా ఉంటానని చెప్పారు.
మంత్రి వర్గంతో కలసి పనిచేయాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.