హీరోయిన్ నయనతార దంపతుల సరోగసి వివాదం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగున్నర నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. సరోగసి విధానంలో పిల్లలకు జన్మనివ్వడం నిబంధనలకు అనుగుణంగా జరిగిందా లేదా? ఇది చట్టబద్ధమేనా కాదా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతలుకు నోటీసులు జారీ చేసి, ఓ కమిటీని నియమించింది. దీనిపై కమిటీ సభ్యులు విచారణ పూర్తి చేశారు. బుధవారం ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ఈ క్రమంలో నయన్ దంపతులకు కమిటీ అఫిడవిట్ పంపింది. తమకు ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయ్యిందని అందులో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్లో సరోగసీ కోసం అప్లై చేశామని, నిబంధనలు అతిక్రమించలేదని పేర్కొన్నారు. ఈ వివాదంపై నివేదికను ప్రభుత్వానికి అందించనున్న నేపథ్యం నివేదికలో ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి నెలకొంది. మరి ఈ వివాదం నుంచి నయన్ దంపతులు బయటపడతారా లేదా అన్నది చూడాలి.