ఏపీ గ్రామ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్రరాజు
సీఎం జగన్‌ను కలిసిన రాష్ట్ర వీఆర్వో అసోసియేషన్ నేతలు
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో రాష్ట్ర
వీఆర్వో అసోసియేషన్ నేతలు సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన వీఆర్వో సంఘం
ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులు జగన్‌ను కలిశారు. అర్హత కల్గిన
వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరాం. ప్రస్తుతం
వీఆర్వోల పదోన్నతుల్లో 40 శాతం రేషియో అమల్లో ఉంది. దీనివల్ల చాలా మంది
వీఆర్వోలకు సీనియర్ సహాయకుల పోస్టులు రావడం లేదు. వీఆర్వోల పదోన్నతుల్లో 70
శాతం రేషియో ఇవ్వాల చేశారు. ఎక్కువ మందికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు
ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. విధి నిర్వహణలో వీఆర్వో చనిపోతే కుటుంబ సభ్యులకు
కారుణ్య నియామకాలు ఇవ్వాలని కోరాం. రాష్ట్రంలో వీఆర్ఏ నుంచి వీఆర్వోకు అర్హత
కల్గిన వారు 1500 మంది ఉన్నారు. వీరందరికీ అర్హత పరీక్ష నిర్వహించి వీఆర్వో
లుగా పదోన్నతి కల్పించాలని సీఎంను కోరామన్నారు. మా వినతిపై సీఎం సానుకూలంగా
స్పందించార ని,భవిష్యత్తులో వీఆర్వోల సమస్యలపై కృషి చేస్తాం. ఇప్పటి వరకు
వీఆర్వోల సమస్యలను పరిష్కరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపామని ఏపీ గ్రామ
రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్రరాజు అన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మంగళవారం సీఎం క్యాంప్
కార్యాలయంలో,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర
అధ్యక్షులుగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు
రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలనాయుడు, ఆంధ్రప్రదేశ్
గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి, రెవిన్యూ
జేఏసీ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్
రెడ్డి ఆదేశాలతో వీఆర్వోలకు సంబంధించి సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ జీవో 154,
మరియు సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్ జీవో64, మరియు కారుణ్య నియామకాల జీవో658,
గ్రేడు 2 నుండి గ్రేడ్ 1 ప్రమోషన్ ఛానల్ జీవో166, జాబ్ చార్ట్ కి సంబంధించి
జీవో31లు కల్పిస్తూఅనేక జీవోలు రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు
ఆధ్వర్యంలో సాధించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
గ్రామ రెవెన్యూ అధికారులసంఘం. కృతజ్ఞతలు తెలిపింది. అలాగే విఆర్వోలకు
సంబంధించి సీనియర్అసిస్టెంట్ పోస్టులలో ఖాళీగా ఉన్న పోస్టులు వన్ టైం
సెటిల్మెంట్ గా వీఆర్వోలతో భర్తీ చేయాలని అలాగే గతంలో ఉన్న రేషియోను 70%కి
పెంచాలని కోరారు. ముఖ్యమంత్రి ఇందుకు సానుకూలంగా స్పందించారు. అలాగే
రెండోసారి ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం.
రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన భూపతి రాజు రవీంద్ర రాజుని, ప్రధాన కార్యదర్శి
ఏం అప్పలనాయుడును ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్
గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి, రెవిన్యూ
జేఏసీ చైర్మన్ వాసా దివాకర్ ముఖ్యమంత్రి ని శాలువాతో సత్కరించారు.