విజయవాడ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మృతి
చెందడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు
రుద్రరాజు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. చాందీ కుటుంబ
సభ్యులకు తన సానుభూతి తెలిపారు.
ఆంధ్రరత్న భవన్ లో :
విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఉమెన్ చాందీ సంతాప సభ
నిర్వహించారు. రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు మస్తాన్ వలి తో పాటు కార్య
నిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మ శ్రీ, మరో కార్య నిర్వాహక అధ్యక్షుడు రాకేష్
రెడ్డి చాందీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చాందీ మృతి
అత్యంత బాధాకరం అని ఈ సందర్భంగా వక్తలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో అస్తవ్యస్తంగా మారిన పార్టీని, 2018లో ఆయన ఏపీ
వ్యవహారాల ఇంచార్జి గా బాధ్యతలు స్వీకరించి గాడిన పెట్టేందుకు చేసిన గొప్ప
ప్రయత్నాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఉమెన్ చాందీ మరణం
కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తన చివరి శ్వాస
వరకు ప్రజలకు సేవ చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కి కృషి చేశారని
కొనియాడారు. చాందీ కుటుంబ సభ్యులకు ఏపీ కాంగ్రెస్ తరుపున ప్రగాఢ సానుభూతి
తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు షేక్ మస్తాన్ వలి, సుంకర
పద్మశ్రీ, పి. రాకేష్ రెడ్డి నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు నరహరశెట్టి
నరసింహారావు, లీగల్ సెల్ చైర్మన్ శ్రీ గురునాధం, ఏ.ఐ.సి.సి. నెంబర్లు ధనేకుల
మురళి, మేడా సురేష్, మీసాల రాజేస్వర రావు, కాజా మొహిద్దీన్, ఆర్.టి.ఐ. చైర్మన్
పి.వై. కిరణ్, బేగ్, ఎం.డి. గౌస్, ఎన్.ఎస్.యు.ఐ. వేముల శ్రీనివాస్,
ఎన్.ఎస్.యు.ఐ. గుంటూరు జిల్లా అధ్యక్షులు కరీం, ఎన్టీఆర్ జిల్లా యూత్
కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసఫ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ అన్సారీ,
బోదాల జోసఫ్, ఇమ్రాన్, షేక్ నాగూర్ తో పాటు పలువురు ఉమెన్ చాందీ చిత్ర పటానికి
నివాళులు అర్పించారు.