క్రాన్ బెర్రీ జ్యూస్ విటమిన్ ఈ, సీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది
వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా
ఉంటాయి. వీటిని తినడంతో వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు.
2.గుండె ఆరోగ్యం
రెగ్యులర్ గా క్రాన్ బెర్రీ జ్యూస్ తాగడంతో రక్తంలో ఫాలీఫినాల్స్ సమ్మేళనాల
ఉత్పత్తి పెరుగుతుంది. ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.గుండె
ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది.
3.యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్:
క్రాన్ బెర్రీ జ్యూస్ ప్రోయాంతిసైనిడిన్స్ అనే మూలకం ఉంటుంది. ఇది హానికరమైన
బ్యాక్టీరియా నిర్మూలనకు సహాయపడుతుంది. దీంతో యూటీఐ సంబంధిత రోగాలు రావు.
4.యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు:
క్రాన్ బెర్రీ జ్యూస్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో
అంథోసైనిన్స్, ప్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తొలగిస్తాయి.
5.జీర్ణ వ్యవస్థ:
క్రాన్ బెర్రీ జ్యూస్ తాగడంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. ఇందులో
ఫైబర్, ఫోటో కెమికల్స్ జీర్ణక్రియకు అవసరమయ్యే బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి.
6.చర్మ సౌందర్యం:
క్రాన్ బెర్రీ జ్యూస్ తాగడంతో చర్మం మెరుస్తుంది. ఇందులో ఉన్న యాంటీ
ఆక్సిడెంట్లు, విటమిన్ సీ కొల్లాజెన్ బూస్టింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి
చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
7.యాంటీ క్యాన్సర్ ఏజెంట్:
క్రాన్ బెర్రీ జ్యూస్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని
తినడంతో క్యాన్సర్ కణాలు వృద్ధి కావు. క్యాన్సర్ కణాలను నిర్మూలించడంలో ఈ
జ్యూస్ సహాయపడుతుంది.
8.నాడీ వ్యవస్థ:
నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చడంలో క్రాన్ బెర్రీస్ జ్యూస్ సహాయపడుతుంది. ఈ
జ్యూస్ తాగడంతో మెదడు చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.
9.నోటి ఆరోగ్యం:
క్రాన్ బెర్రీ ప్రోయాంతో సైనిడిన్స్ ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని
మెరుగుపరుస్తాయి. ఈ జ్యూస్ తాగడంతో రక్తస్రావం తగ్గుతుంది. చిగుళ్లు ఆరోగ్యంగా
మారుతాయి.