బాధపడుతున్నారు. అయితే ఈ వానాకాలంలో లభించే కొన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి
చాలా మేలు చేస్తాయి అవేంటో చూద్దాం..
1) నేరేడు:
వేసవి కాలంతో పాటు వర్షాకాలంలో నేరేడు పండ్లు విరివిగా లభిస్తాయి. ఈ పండులో
ఫైబర్ ఎక్కువగా ఉండి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల
డయాబెటిక్ ఉన్నవారు కూడా ఈ పండ్లు తినొచ్చు.
2) బత్తాయి:
బత్తాయిల్లో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్
చాలా తక్కువ. ఈ పండ్లు డయాబెటిక్ పేషెంట్లకు, బరువు తగ్గాలనుకునే వారికి చాలా
మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి అనేక అనారోగ్య సమస్యలు రాకుండా
నివారిస్తాయి.
3) అల్బుఖారా:
అల్బుఖారా పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. అచ్చం టొమాటోల్లాగా ఉండే ఈ
పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటిక్ ఉన్నవారితో
పాటు బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లను తినొచ్చు.
4) పీచ్ పండ్లు:
వర్షాకాలంలో ఎక్కువగా లభించే పండ్లలో పీచ్ ఒకటి. దీనిని షుగర్ పేషెంట్లు కూడా
తినొచ్చు. ఇందులోని ఐరన్, పొటాషియం, విటమిన్ సి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
5) బేరి పండ్లు:
బేరి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ తగ్గించుకోవడానికి, బరువు
తగ్గాలనుకు వారికి ఇది చాలా మంచిది. వర్షాకాలంలోనూ ఈ పండ్లను తినొచ్చు.
6) చెర్రీస్:
చెర్రీ పండ్లు డయాబెటిక్ పేషెంట్లకు మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా
ఉంటుంది. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. వర్షాకాలంలో ఇవి ఎక్కువగా
అందుబాటులో ఉంటాయి.
7) దానిమ్మ:
దానిమ్మలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
దీంతో అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. డయాబెటిస్ పేషెంట్లు మాత్రం ఈ
పండ్లు తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.
8) అరటి పండ్లు:
ఏ సీజన్ లో అయినా ఎక్కువగా లభించే అరటిలో పోషకాలు ఎక్కువ. ఇవి ఆరోగ్యానికి
ఎంతో మేలు చేస్తాయి. బనానా తింటే బరువు నియంత్రణలో ఉంటుంది.