ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం.
1.సోడా:
డైట్ సోడాలో జీరో క్యాలరీలు ఉంటాయి. వీటిలో ఆర్టిఫిషియల్ స్వీట్ నర్లు అధిక
మోతాదులో ఉంటాయి. సోడాను రెగ్యులర్ గా తీసుకోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు
పెరిగే అవకాశం ఉంది.
2.ఇన్స్ స్టంట్ ఓట్ మీల్:
బరువు తగ్గాలనుకునేవారికి ఓట్ మీల్ సరైన ఎంపిక. కానీ ఓట్మీల్ తీసుకోవడంతో
బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. క్విక్ రెసిపీ ఓట్ మీల్ లో ఫైబర్
కంటెంట్ ఉండదు.
3.నారింజ రసం:
ఎక్కువగా నారింజ జ్యూస్ తాగడంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. నారింజ
రసంలో ఫైబర్ కంటెంట్ ఉండదు. ఇది స్టార్చ్ ను గ్లూకోజ్ గా విభిజంచడంలో
సహాయపడుతుంది.
4.బ్రెడ్:
తృణధాన్యాల్లో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటితో తయారు చేసిన
రొట్టెలు తినడంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.
5.సూప్:
సాధారణంగా సూప్ మంచిదే అయినప్పటికీ రెస్టారెంట్ సూప్ లు తాగడంతో రక్తంలో
చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఈ సూప్ లో చక్కెర ఎక్కువగా ఉండే అవకాశం
ఉంది.
6.ద్రాక్ష:
ద్రాక్షలో చక్కెర కంటెంట్ ఎక్కువగా, ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇది
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణం అవుతుంది.
7.ఎనర్జీ బార్స్:
ప్యాక్ చేసిన ఎనర్జీ బార్స్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో పిండి
పదార్థాలు సైతం ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించినప్పటికీ రక్తంలో
చక్కెర స్థాయిలను పెంచుతాయి.
8.బ్రౌన్ రైస్:
బ్రౌన్ రైస్ సాధారణ రైస్ కంటే పోషకమైనది అయినప్పటికీ ఇందులో కార్బోహైడ్రేట్స్
అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను విపరీతంగా పెంచుతాయి.