వాషింగ్టన్: అమెరికాలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పిడుగులు పడుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కనెక్టికట్, మసాచుసెట్స్,
న్యూహ్యాంప్‌షైర్, న్యూయార్క్, రోడ్ఐలాండ్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం
వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భీకర వర్షాలకుతోడు పిడుగుల ముప్పు కారణంగా అమెరికాలో తాజాగా 2,600కుపైగా
విమానాల రాకపోకలను రద్దుచేశారు. మరో 8,000 విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా
రాకపోకలు సాగించాయి. ప్రధానంగా ఈశాన్య అమెరికాలో వాతావరణం ప్రతికూలంగా
మారింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేన్వియా, మసాచుసెట్స్,
వెర్మాంట్‌లో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా, పశ్చిమ, దక్షిణ
అమెరికా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో
ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక జనం ఇళ్ల నుంచి బయటకు
రావడం లేదు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని డెత్ వ్యాలీలో ఏకంగా 52 డిగ్రీల
సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.