వైద్యులు సలహా ఇస్తారు. ఎండు వాటిని నానబెట్టుకుని తింటే రెట్టింపు ఆరోగ్య
ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు పోషకాహార నిపుణులు.
1) బరువు తగ్గడానికి:
అంజీరను రాత్రి నానబెట్టుకుని ఉదయం తింటే దానిలోని పీచు నిదానంగా జీర్ణమై
కడుపును నిండుగా ఉంచుతుంది. వేరే పదార్థాలు తినాలనే ధ్యాస లేకుండా చేసి
బరువును అదుపు చేస్తుంది.
2) చక్కెర స్థాయులను నియంత్రించి:
మధుమేహం ఉన్నవారు నిద్రపోయే ముందు రెండు అంజీరాలను నీటిలో నానబెట్టుకుని
పొద్దునే తింటే మంచిది. వీటిలో మేలు చేసే ఒమేగా 3 కొవ్వులు రక్తంలో చక్కెర
స్థాయులను నియంత్రించడంలో సాయపడతాయి.
3) ఎముకల కోసం:
చాలా మంది మహిళలు క్యాల్షియం లోపంతో బాధపడుతుంటారు. నానబెట్టిన అంజీరను తరచూ
తింటే దీనిలోని పొటాషియం, క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి.
4) గర్భిణులకు:
అంజీరాల్లోని విటమిన్ బి6, ఒమేగా-3ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి బిడ్డ
ఎదుగుదలకు సాయపడతాయి. అయితే అంజీరాలను మితంగానే తీసుకోవడం మంచిది.
5) మెరిసే చర్మానికి:
విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని అందించి
ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా చేస్తుంది.