ఫ్రైలో చారు వేసుకుని తింటే.. ఆ టేస్టే వేరు. కేవలం రుచికి మాత్రమే
పరిమితమైపోలేదు మన గోకరకాయ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
* గోరు చిక్కుడులో ఉండే పోషకాలు:
*గోరు చిక్కుడులో ప్రొటీన్లు అధికం.
* స్వల్పంగా పిండిపదార్థాలు, పీచుపదార్థాలు ఉంటాయి.
*విటమిన్-ఎ, విటమిన్ -బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్-సి, విటమిన్ కె
వంటివి గోరు చిక్కుడులో ఉంటాయి.
* క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలను గోరు చిక్కుడు
కలిగి ఉంటుంది.
* గోరు చిక్కుడు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
* మధుమేహంతో బాధపడే వారికి గోరు చిక్కుడు వంటలు ఉపయోగకరం. రక్తంలో చక్కెర
స్థాయిని ఇది నియంత్రిస్తుంది.
* అంతేగాక గోరు చిక్కుళ్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
* అదే విధంగా కాల్షియం, ఫాస్పరస్ కలిగి ఉండటం వల్ల ఎముకలకు, కండరాలకు
బలాన్నిస్తాయి.
* గోరు చిక్కుడులో ఐరన్ ఉంటుంది. కాబట్టి రక్తహీనతను నివారించడంలోనూ ఇది
ప్రముఖ పాత్రను పోషిస్తుంది.
* జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యర్థాలను బయటకు పంపే గుణం దీనికి
ఉంటుంది.
* స్థూలకాయాన్ని అరికట్టడంలోనూ చిక్కుడు పాత్ర చెప్పుకోదగినదే.
* చూశారు కదా గోరు చిక్కుడుతో ఏన్ని ప్రయోజనాలు ఉన్నాయో…మీరు గోరు
చిక్కుడును మీ ఆహారంలో భాగం చేసుకోండి.