ఆరోగ్యంగా ఉంటే రక్తం సులభంగా ప్రవహిస్తుంది. రక్తప్రవాహంలో ఇబ్బందులు
ఏర్పడితే గుండె ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఈ సమయంతో ధమనులపై పడిన ప్రజర
న్ను బీపీ అంటారు.
కారణాలు:
సరైన పోషకాహారం తినకపోవడం, నిత్యం ఒత్తిడికి గురికావడం, సోడియం, రిఫైన్డ్
ఆయిల్ లేదా ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారాలు తినడంతో రక్తపోటు
పెరుగుతుంది.
వీటితో ఉపశమనం:
రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా
ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక్కడ బీపీ రోగులు
తినాల్సిన ఆకుకూరల గురించి తెలుసుకుందాం..
1) బచ్చలికూర:
బచ్చలికూరలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో సోడియం స్థాయిలను
తగ్గించడంలో బచ్చలికూర సహాయపడుతుంది. దీంతో రక్తపోటు తగ్గుతుంది. ఇందులో
లభించే ఫోలేట్, మెగ్నీషియం ఆరోగ్యాన్ని అందిస్తాయి.
2) సెలరీ:
సెలరీ తినడంతో అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. సెలరీ తినడంతో
శరీరంలో నీటి శాతం సమతుల్యంగా ఉంటుంది. సెలరీని సలాడ్ లో కలుపుకొని తినొచ్చు.
3) క్యాబేజీ:
100 గ్రాముల క్యాబేజీలో దాదాపు 170 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది.
రెగ్యులర్గా క్యాబేజీ తినడంతో రక్తంపోటు స్థిరంగా ఉంటుంది. ఇందులో ఉన్న అనేక
పోషకాలు ఆరోగ్యాన్ని అందిస్తాయి.
4) పాలకూర:
పాలకూరను రెగ్యులర్గా తినడంతో రక్తపోటు స్థిరంగా ఉంటుంది. ఇది గుండె
ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలకూరను శాండివిచ్ ఫిల్లింగ్, సలాడ్ రూపంలో
తీసుకోవచ్చు.
5) కాలే:
వంద గ్రాముల కాలేలో 348 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. కాలేలో ఉండే
లుటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా
ఉంచుతాయి.
ఈ ఆకుకూరలను తింటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో బీపీ కంట్రోల్లో ఉంటుంది.
వ్యాయామం చేయడంతో ఒత్తిడి తగ్గుతుంది. దీంతో రక్తపోటు తగ్గుతుంది.