మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే బాడీలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండటం అవసరం. ఈ
ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలంటే శరీరంలో తెల్ల రక్తకణాలు సరిగా ఉండటం అవసరం.
మరి ఇలాంటి తెల్ల రక్తకణాలను పెంచే ఆహారాలు ఏమిటంటే..?
* సిట్రస్ పండ్లు:
నారింజ, నిమ్మకాయ, పైనాపిల్, గ్రేప్ ఫ్రూట్ వంటి విటమిన్ సి అధికంగా గల పండ్లు
తెల్ల రక్తకణాల సంఖ్య పెరుగుదలలో సహాయపడతాయి. దీంతో రోగనిరోధక శక్తి రెట్టింపు
అవుతుంది.
* వెల్లుల్లి:
రక్తపోటును నియంత్రించడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే తెల్ల
రక్తకణాలు = సంఖ్య పెరుగుదలను ప్రోత్సహించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* సన్ ఫ్లవర్ సీడ్స్:
పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ బి6, ఇ, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే
వైరల్ ఇన్ఫెక్షన్ ను తగ్గించే సెలీనియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక
శక్తిని పెంచుతుంది.
* బాదం:
బాదం గింజల్లో విటమిన్-ఇ తో పాటు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి
తెల్ల రక్తకణాలను రెట్టింపు చేసి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.
* పసుపు:
పసుపులో యాంటీఇంఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. అలాగే ఇందులోని కర్కుమిన్ అనే
సమ్మేళనం తెల్ల రక్తకణాల పెరుగుదలకు సహాయపడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* బెర్రీస్:
స్ట్రాబెర్రీ, నేరేడు, ఫాల్సా, బ్లాక్ బెర్రీస్ వంటి బెర్రీ పండ్లలో
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తెల్ల రక్తకణాల ఉత్పత్తిలో సహాయపడతాయి.
* బొప్పాయి:
ఓ చిన్న బొప్పాయి పండులో ఓ రోజుకు కావాల్సిన విటమిన్ సి ఉంటుంది. ఇందులోని
పపైన్ అనే సమ్మేళనం యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది తెల్ల
రక్తకణాల ఉత్పత్తిలోనూ సహాయపడుతుంది.
* పౌల్ట్రీ ఫుడ్:
చికెన్, కోడి గుడ్లు లాంటి పౌల్ట్రీ ఫుడ్స్ కూడా తెల్ల రక్తకణాల ఉత్పత్తిని
పెంచుతాయి. అలాగే రోగనిరోధక శక్తిని రెట్టింపు చేయడంలో సహాయపడతాయి.