విజయవాడ : చేతి వృత్తులు, చేనేత సొసైటీలు, మత్స్యకార సొసైటీ నాయకులతో బిజెపి
రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సోమవారం సమావేశం అయ్యారు. బిజెపి
రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కి చేనేత, మత్స్య కార సంఘాల
ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ఆయా రంగాల సమస్యలను వారి దృష్టిలోకి
తీసుకువచ్చారు. ఈసందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ సంక్షేమ
పధకాలు ఆయారంగాలకు కింది స్ధాయి వరకు చేరవలసిన ఆవశ్యకతను చెబుతూ ఈ సమస్యలను
కేంద్ర ప్రభుత్వ దృష్టిలోకి తీసుకుని వెళ్ళి పరిష్కారానికి ప్రయత్నం
చేస్తానన్నారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించే సందర్భంగా ఆయా వర్గాల నాయకులను,
లబ్ధిదారులను నేరుగా కలిసి వారి దీర్ఘకాలిక పెండింగ్ లో ఉన్న సమస్యల పై
రాష్ట్ర వ్యాప్త ఉధ్యమానికి, కేంద్రం ప్రభుత్వ సహకారంతో పరిష్కారానికి
శ్రీకారం చుడుతామని చెప్పారు.