న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని
విపక్షాలన్నీ సమైక్యంగా సవాల్ చేస్తాయన్న విశ్వాసాన్ని కాంగ్రెస్ సీనియర్
నేత చిదంబరం వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక కూటమికి కూడా నాయకుడు తగిన
సమయంలో ఉద్భవిస్తాడని తెలిపారు. అవినీతిపరులే విపక్ష కూటమిలో ఉన్నారన్న
ప్రధాని ఆరోపణలను ఖండించారు.మోడీ ది డొల్ల వాదన. తాజాగా అది కర్ణాటకలో
నిరూపితమైంది. ఒకప్పుడు ఆయన అవినీతిపరులని ఆరోపించిన వ్యక్తులే. ప్రభుత్వంలో
మంత్రులుగా, పార్టీలో ముఖ్యులుగా ఉన్నారు’’ అని చిదంబరం పేర్కొన్నారు. ప్రధాని
అభ్యర్థి పేరును ప్రకటించకుండా పదేళ్లు అధికారంలో ఉన్న మోడీ ని విపక్షాలు
ఎదుర్కొగలవా అన్న ప్రశ్నకు చిదంబరం సమాధానమిస్తూ పదేళ్ల అధికారం బలం కాదు.
బలహీనత. ప్రధాని చేతులు ఖాళీగా ఉన్నాయి. తన వాగ్దానాలను ఆయన నెరవేర్చలేదు.
గతేడాదంతా మరిన్ని నినాదాలు చేయడం తప్ప ఆయన చేసిందేమీ లేదు. విపక్షాలు ఐక్యంగా
ఉంటే కచ్చితంగా మోదీని నిలువరించవచ్చని చెప్పారు.