కీవ్ : అమెరికా సరఫరా చేస్తున్న క్లస్టర్ బాంబులను యుద్ధంలో ఉక్రెయిన్
వాడేందుకు ప్రయత్నిస్తే తాము కూడా దీటుగా సమాధానం చెబుతామని రష్యా అధ్యక్షుడు
వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. తమ దగ్గరా భారీగా క్లస్టర్ బాంబు నిల్వలు
ఉన్నాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు క్లస్టర్
ఆయుధసామగ్రి సరఫరాపై పుతిన్ తొలిసారి స్పందించారు. యుద్ధంలో ఇంతవరకు
క్లస్టర్ బాంబులను రష్యా వినియోగించలేదని చెప్పారు. అలాంటి అవసరం తమకు
లేదన్నారు. అమెరికా సమకూర్చిన క్లస్టర్ ఆయుధసామగ్రి ఉక్రెయిన్ చేరుకున్నట్లు
పెంటగాన్ గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. గతంలో జరిగిన పలు సంఘర్షణల్లో
క్లస్టర్ బాంబులు వినియోగించినప్పుడు వాటి ‘నిరర్థక రేటు’ చాలా ఎక్కువగా
ఉంది. అంటే పేలని అనేక చిన్న బాంబులు ఆ ప్రాంతంలో ఉండిపోతాయి. దీంతో యుద్ధం
ముగిసిన తర్వాత కూడా అవి ఆ ప్రాంతంలోని పౌరులకు ప్రమాదకరంగా పరిణమిస్తుంటాయి.
ఈ నేపథ్యంలో క్లస్టర్ బాంబులను చాలాకాలంగా పలు స్వచ్ఛంద సంస్థలు, వివిధ
గ్రూపులతో పాటు అమెరికా మిత్రదేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అయితే వీటిని
సమర్థించే కొందరు మాత్రం రష్యా ఇప్పటికే క్లస్టర్ ఆయుధాలను వినియోగించిందని,
అమెరికా సమకూర్చిన వాటిలో ‘నిరర్థక రేటు’ చాలా తక్కువగా ఉంటుందని
వాదిస్తున్నారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు దూరంగా మాత్రమే వీటిని
ఉపయోగిస్తామని ఉక్రెయిన్ చెబుతోంది. కాగా గత 24 గంటల్లో రష్యా అనేక దాడులు
చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. రష్యా రెండు ఇరాన్ తయారీ పేలుడు
డ్రోన్లు, రెండు క్రూయిజ్ క్షిపణులు, మరో రెండు విమాన విధ్వంసక గైడెడ్
క్షిపణులను ప్రయోగించినట్లు పేర్కొంది. వీటితో పాటు 40 వైమానిక దాడులు, బహుళ
రాకెట్ లాంచర్లతో 46 దాడులు చేసినట్లు తెలిపింది. దొనెట్స్క్ ప్రాంతంలో
ఇద్దరు మృతి చెందగా, మరొకరు గాయపడినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఖేర్సన్
దక్షిణ ప్రాంతంలో ఆదివారం రష్యా దళాలు పేలుడు పదార్థాల పరికరాన్ని
జారవిడిచాయని, దీంతో ఇద్దరు బాలురు గాయపడినట్లు పేర్కొంది. మరోవైపు
ఉక్రెయిన్‌కు చెందిన ఎనిమిది డ్రోన్లను కూల్చివేసినట్లు మాస్కో ప్రకటించింది.