లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బ్రిటన్ రాజు చార్లెస్-3 మైనపు బొమ్మ నమూనాపై వాతావరణ కార్యకర్తలు సోమవారం చాక్లెట్ కేక్ పూశారు. జస్ట్ స్టాప్ ఆయిల్ ప్రదర్శనకారులు నిరసన వ్యక్తం చేస్తూ..”అన్ని కొత్త చమురు, గ్యాస్ లైసెన్సులు , సమ్మతి”ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. “సుమారు 10:50 గంటలకు ఇద్దరు వ్యక్తులు విగ్రహం వద్ద ఆహారాన్ని విసిరిన తర్వాత మేడమ్ టుస్సాడ్స్‌లో జరిగిన సంఘటనపై మేము త్వరగా స్పందించాము. వారిద్దరినీ క్రిమినల్ డ్యామేజ్ చేసినందుకు అరెస్టు చేశాము” అని మెట్రోపాలిటన్ పోలీసులు ట్వీట్లో తెలిపారు. అన్ని కొత్త చమురు, గ్యాస్ లైసెన్స్‌లు, సమ్మతిని నిలిపివేయాలని వాతావరణ కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఇలాంటి నిరసన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మూలం: హిందూస్తాన్ టైమ్స్