తెలుగు చిత్ర పరిశ్రమలో ముద్దు గుమ్మగా ఉన్న. అనూ ఇమ్మాన్యుయేల్ కు పట్టరాని కోపం వచ్చింది. తాజా ఆమె నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం నవంబర్ 4న ఈ ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ సందర్భంగా అనూ ఇమ్మాన్యూయేల్ ప్రమోషన్స్తో బిజీ అయ్యారు. తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు అనూ అసహనం వ్యక్తం చేసింది. సదరు వ్యక్తి ‘‘మేడమ్ మీరు బన్నీతో ‘నా పేరు సూర్య’లో యాక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ల తమ్ముడి శిరీష్తోనూ స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. అన్నదమ్ములిద్దరిలో ఎవరు క్యూట్? ఎవరు నాటీ’’ అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో కోపానికి గురైన అను.. ‘‘మీకు అడగడానికి వేరే ప్రశ్నలు లేవా? దయచేసి.. కాస్త మంచి ప్రశ్నలు అడగండి’’ అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో ఆ వ్యక్తి ‘సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటని’ ప్రశ్నించాడు. ‘‘అది ఇప్పుడే చెప్పకూడదు. సినిమాలో చూడాలి’’ అని సమాధానమిచ్చారు మల్లూబ్యూటీ. అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించారు.