బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అస్వస్థతకు లోనయ్యాడు. కొన్ని రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో పరీక్షలు చేయించుకోగా డెంగీ అని తేలింది. ప్రస్తుతం బాలీవుడ్ భాయ్‌జాన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఫలితంగా బాలీవుడ్ సెలబ్రిటీలు హోస్ట్ చేస్తున్న దీపావళి పార్టీలోను కనిపించడం లేదు. బిగ్‌బాస్ రియాలిటీ షోను కూడా హోస్ట్ చేయడం లేదు. ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్లన్ని వాయిదా పడ్డాయి. సల్లూ భాయ్ కోలుకుంటున్నట్టు అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. సల్మాన్ ఖాన్ సినిమాల్లో నటించడంతో పాటు బిగ్‌బాస్ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. డెంగీ బారిన పడటంతో ఈ షోలో ప్రతి శుక్రవారం ప్రసారమయ్యే వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌ను హోస్ట్ చేయలేదు. మరికొద్ది రోజులు బ్రేక్ తీసుకొబోతున్నట్టు తెలుస్తోంది. అతడి స్థానంలో ఈ రియాలిటీ షోను కరణ్ జోహార్ హోస్ట్ చేయబోతున్నాడు.