లిథువేనియాకు చెందిన యూజెనిజస్ కవలియాస్కాస్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటో గ్రాఫర్ మైక్రోస్కోప్‌ను ఐదురెట్లు పెద్దదిగా చేసి చీమ ముఖాన్ని ఫొటో తీశాడు. ఈ ఫొటోకి నికాన్ వరల్డ్ ఫొటోమైక్రోగ్రఫీ 2022 పోటీల్లో బహుమతి కూడా లభించింది.
సింహంతో ఫొటో అంటే భయపడతాం. అదే చీమతో అంటే తేలిగ్గా తీసిపారేస్తాం. కానీ, ఆ చీమను దగ్గర నుంచి చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఇదే ఆలోచన ఓ ఫొటోగ్రాఫర్ మదిలో మెదిలింది. ఆ ఆలోచనతో తీసిన ఫొటో ప్రపంచంలోనే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ ఫొటో చూసినవారు ‘అమ్మో చీమ’ అనేంత భయంకరంగా ఉంది. లిథువేనియాకు చెందిన యూజెనిజస్ కవలియాస్కాస్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ మైక్రోస్కోప్‌ను ఐదురెట్లు పెద్దదిగా చేసి చీమ ముఖాన్ని ఫొటో తీశాడు. ఈ ఫొటోకి నికాన్ వరల్డ్ ఫొటోమైక్రోగ్రఫీ 2022 పోటీల్లో బహుమతి కూడా లభించింది.
ఆ చిత్రం చూస్తే హాలీవుడ్ సినిమాలో యానిమేషన్ సీన్ చూసినట్లుగా ఉంది. చీమ కళ్లు,ముక్కు, నోరు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోను చూసిన వారిలో కొందరు అసలు ఇది చీమేనా?అని అంటుంటే కొందరు మాత్రం..చీమ ఇంత భయంకరంగా ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కంటితో నేరుగా చూడలేని జీవరాశుల ఫొటోలను ఈ పోటీలకు అనుమతిస్తారు. తాజా పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 1300 ఫొటోలు బరిలో నిలవగా.. అందులో 57 చిత్రాలను ఎంపిక చేశారు. అందులో కవలియాస్కాస్ తీసిన ఈ చిత్రం ఒకటి.