27న ఏలూరు లో జరగబోయే ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయండి
ఒకటో తారీకు జీతాలు పెన్షన్లు చెల్లించడం ప్రభుత్వం బాధ్యత
ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : బకాయిపడ్డ నాలుగు డి ఎ లు, పిఆర్సి ఆరియర్స్, పే స్కేల్స్, స్పెషల్
పే లు, కొన్ని ముఖ్యమైన శాఖాపరమైన డిమాండ్లపై ప్రభుత్వం నుండి స్పష్టమయిన
ఆదేశాలు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగించాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశ ఏకగ్రీవ
తీర్మానం చేసినట్లు ఏపిజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
వెల్లడించారు. ఈనెల 27న ఏలూరు లో జరగబోయే ప్రాంతీయ సదస్సు ( పశ్చిమగోదావరి
జిల్లా, కృష్ణ జిల్లా ఏలూరు జిల్లా) ఏలూరులోని “టొబాకో మర్చంట్ కళ్యాణ మండపం”
నందు నిర్వహించేందుకు మంగళవారం ఏపిజేఏసి అమరావతి సభ్య సంఘాల ఏలూరు జిల్లా కు
చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, పొరుగుసేవల ఉద్యోగ
సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల తో ఏలూరు రెవిన్యూ భవనం లో ఏపిజేఏసి అమరావతి ఏలూరు
జిల్లా చైర్మన్ కె. రమేష్ కుమార్ అధ్యక్షతన సమావేశము జరిపిన అనంతరం మీడియా
సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశములో ఏపిజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
ఏపిలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు, ఔట్
సోర్శింగు ఉద్యోగుల సమస్యలుపై నిజాయిగా ఉద్యోగుల పక్షాణ గత 76 రోజులుగా
ఏపిజేఏసి అమరావతి ఆద్వర్యంలో చేస్తున్న ఉద్యమ ఫలితంగా ప్రభుత్వం స్పందించి
కొన్ని సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ, నిన్న టెలీకాన్ఫరెన్స్
ద్వారా జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 26 జిల్లాల నాయకత్వం మాట్లాడుతూ
బకాయిపడ్డ నాలుగు డి ఎ లు, పిఆర్సి ఆరియర్స్, పే స్కేల్స్, స్పెషల్ పే లు
వీఆర్ ఏ లకు డి ఏ , పదోన్నతి పొందిన గ్రేడ్-II వి ఆర్ ఓ లకు పే స్కేల్
ఇవ్వడం, విలీనానికి ముందు అర్టిసి లో పనిచేస్తున్న ఉద్యోగులకు పాత సర్వీస్
రూల్స్ వర్తింప చేయడం, హోం గార్డ్స్ ను ఇతర యూనిఫాం సర్వీస్ శాఖలలో విలీనం
చేయడం, మిగిలి పోయిన తొమ్మిది వందల బాషా పండితుల కొరకు సూపర్న్యుమరరీ స్కూల్
అసిస్టెంట్ పోస్టులు మంజూరు, గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సర్వీస్ రూల్స్
సమస్యలు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగుల పేరు ఇంజనీర్ సుబార్డినేట్ గా మార్చి 010
పద్దు కింద జీతాలు, డిఆర్డిఎ ఉద్యోగులను పీ ఆర్, ఆర్ డీ శాఖలో విలీనం చేయడం,
మునిసిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం, రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లోని
ఇంజనీర్లకు డిఈ పోస్టులు మంజూరు తదితర ముఖ్య అంశాల అన్నింటిపైనా స్పష్టమైన
లిఖితపూర్వక ఉత్తర్వులు ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగించాలనిరాష్ట్ర కార్యవర్గ
సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామని, అంతవరకు ఈ ఉద్యమం ఆపేది లేదిని ఏపిజెఏసి
అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీజెనరల్ పలిశెట్టి
దామోదరరావులు తెలిపారు.
అదేవిధంగా, ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించాల్సిన భాధ్యత
ప్రభుత్వానిదేనని, కానీ గత రెండు సంవత్సరాలుగా జీతాలు పెన్షన్లు ఒకటో తారీకున
చెల్లించకుండా ఉద్యోగులను, పెన్షనర్ లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని,
కొన్ని స్కీమ్ ల క్రింద పనిచేసే ఉద్యోగులకు గత ఆరు మాసాలుగా జీతాలు ఇవ్వడం
లేదని తెలిపారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర
అధ్యక్షులు కృష్ణ మోహన్, క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ అధ్యక్షులు యస్.మల్లేశ్వర
రావు, ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర కార్యదర్శి బి. జ్యోతి, ఏపీ వీఆర్ఓ సంఘం
రాష్ట్ర కార్యదర్శి ఏ.సాంభ శివ రావు, కే.పి.చంద్ర శేఖర్, ఏపిజెఏసి అమరావతి
ఏలూరు జిల్లా చైర్మన్ కె. రమేష్ కుమార్, కార్యదర్శి ఏ. ప్రమోద్ కుమార్, ట్రేడ్
యూనియన్ నాయకులు ఏ ఐ టి యు సీ జిల్లా కార్యదర్శి బండి వేంకటేశ్వర రావు,
కృష్ణమాచార్యులు, సి ఐ టి యు ఉపాధ్యక్షులు సోమయ్య, డ్రైవర్స్ సంఘం అధ్యక్షులు
వేణు, ఏపిజెఏసి అమరావతి నాయకులు వర్మ, వీరబాబు, పెన్షనర్స్ అస్సోసియేషన్
జిల్లా కార్యదర్శి మహాలక్ష్మి, గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగుల నాయకులు
హుస్సేన్ వివిధ ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.